ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP)
ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP) ద్వారా ఒకేసారి రెండు కోర్సులు పూర్తిచేయవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ చదువుతూనే టీచింగ్ లో శిక్షణ పొందవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత BSc, BCom, BA వంటి సాధాారణ డిగ్రీ కోర్సులతో పాటే B.Ed పూర్తిచేయవచ్చు.
ఈ కోర్సు ద్వారా ఓ సంవత్సర కాలాన్ని ఆదా చేయవచ్చు. సాధారణంగా డిగ్రీ చేయడానికి మూడేళ్లు, ఆ తర్వాత బిఎడ్ లో చేరి కోర్సు పూర్తిచేయడానికి రెండేళ్ళ సమయం పడుతుంది. అలాకాకుండా ఈ ఐటిఈపి ద్వారా కేవలం నాలుగేళ్లలో అటు డిగ్రీ, ఇటు బిఎడ్ పూర్తిచేయవచ్చు.
అయితే ITEPలో ప్రవేశం కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET) వుంటుంది. ఇందులో అర్హత సాధించినవారే ITEP డిగ్రీకి అర్హులు. ప్రాథమిక స్థాయిలో విద్యాబ్యాసం చేయడానికి ఈ డిగ్రీ చేసినవారు అర్హులు. అయితే ఉన్నత స్థాయి విద్యా బోధన కోసం మాత్రం బి.ఎడ్ తప్పనిసరి.