భారతీయ విద్యార్థులకు బంపరాఫర్ ... గూగుల్ అందించే టాప్ 5 స్కాలర్ షిప్స్ అందుకునే అవకాశం

First Published Sep 13, 2024, 10:54 PM IST

భారతీయ విద్యార్థులకు గూగుల్ స్కాలర్ షిప్స్ అందిస్తుందనే విషయం తెెలుసా? స్కూల్ విద్యార్థుల నుండి కాలేజీ యువత వరకు ఈ స్కాలర్ షిప్స్ పొందుతున్నారు. మీరు కూడా గూగుల్ స్కాలర్ షిప్ పొందాలనుకుంటే ఈ కథనం చదివి వివరాలు తెలుసుకొండి  

google

Google Scholorships : గూగుల్ ... పరిచయం అక్కర్లేని పేరు. ఈ టెక్నాలజీ యుగంలో అంతా గూగుల్ మయమే. మనిషికి మనుగడకు కూడు, గూడు, గుడ్డ ఎంత అవసరమే గూగుల్ కూడా అంతే అవసరం అనేలా ప్రస్తుత పరిస్థితి వుంది. యావత్ ప్రపంచాన్ని మన అరచేతిలో వుంచుతోంది గూగుల్. ఇలా గూగుల్ సెర్చ్ ఇంజన్ గా మనందరికి తెలుసు. ప్రపంచానికి జ్ఞానాన్ని పంచుతూ ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంది. ముఖ్యంగా యువత విద్య, విజ్ఞానాన్ని అందించేందుకు తనవంతు సహకారం అందిస్తోంది. వివిధ స్కాలర్ షిప్స్ ద్వారా తెలివైన విద్యార్థులకు ప్రోత్సహిస్తోంది... వారి కలలను సాకారం చేసుకునేందుకు సహకరిస్తోంది గూగుల్. ఇలా గూగుల్ అందించే ప్రముఖ స్కాలర్ షిప్స్ గురించి తెలుసుకుందాం. 

Women Techmakers Scholars Program

1. ఉమెన్ టెక్ మేకర్స్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం : 

మహిళా సాధికారత కోసం గూగుల్ చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటే ఈ స్కాలర్ షిప్. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుందుకు ప్రయత్నిస్తోంది గూగుల్. ఈ క్రమంలోనే టెక్నాలజీ రంగంలో మహిళల పాత్రను పెంచి లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ఉమెన్ టెక్ మేకర్స్ స్కాలర్ షిప్స్ అందిస్తున్నారు. 

ఈ స్కాలర్ షిప్ కోసం గూగుల్ టాలెంటెడ్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ యువతులను ఎంపిక చేస్తుంది. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ వంటి టెక్నికల్ కోర్స్ చేసినవారికే అవకాశం. వీరికి గూగుల్ తో కలిసి పనిచేసే అవకాశం కల్పించడంతో పాటు నగదు బహుమతి కూడా ఇస్తారు. గతంలో గూగుల్ నుండి స్కాలర్ షిప్ పొందినవారిని మళ్లీ అనుమతించరు. 

ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో నిర్వహిస్తారు.
 

Latest Videos


Venkat Panchapakesan Memorial Scholarship

2. వెంకట్ పంచపకేశన్ మెమోరియల్ స్కాలర్ షిప్ : 

ఉన్నత విద్యాబ్యాసం కోసం ఆర్థిక సాయం కోరేవారికి ఈ స్కాలర్ షిప్ అందిస్తుంది గూగుల్. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ వంటి టెక్నికల్ కోర్సులు చేయాలనుకునేవారు అప్లై చేసుకోవచ్చు. 

ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వారు 750 అమెరికన్ డాలర్లను సాయంగా పొందుతారు. ఈ డబ్బులు కాలేజీ ఫీజు, ఇతర విద్యా సంబంధిత ఖర్చులకోసం ఉపయోగించుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్ హోల్డర్స్ కు అమెరికాలోని యూట్యూబ్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించే అద్భుత అవకాశం దక్కుతుంది. 

గుర్తింపుపొందిన ఏదయిన విద్యాసంస్థలో అండర్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవారు అర్హులు. కంప్యూటర్ సైన్స్ వంటి టెక్నికల్  కోర్సులు చేస్తూ మంచి అకడమిక్ రికార్డ్ కలిగివుండేవారినే  ఈ స్కాలర్ షిప్ కు ఎంపికచేస్తారు. 

ప్రతి ఏటా మే,జూన్, జూలై నెలలో  దరఖాస్తులను ఆహ్వానిస్తారు. 
 

Google Conference and Travel Scholarships

3. గూగుల్ కాన్ఫిరెన్స్ ఆండ్ ట్రావెల్ స్కాలర్ షిప్ : 
 
గూగుల్ అందించే వినూత్నమైన స్కాలర్ షిప్స్ లో ఇది ఒకటి. వ్యాపారం, ఇండస్ట్రీస్ లో టెక్నాలజీ అభివృద్ది కోసం పర్యటనలు చేపట్టేవారికి ఈ స్కాలర్ షిప్స్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని టెక్నికల్ కాన్ఫిరెన్స్ లలో పాల్గొనేందుకు అవసరమయ్యే ఖర్చులకోసం గూగుల్ ఆర్థికసాయం చేస్తుంది. ఇలా స్కాలర్ షిప్ కు ఎంపికైన వారికి 1000 నుండి 3000 వేల యూఎస్ డాలర్లను అందిస్తుంది. కాన్ఫిరెన్స్ లో పాల్గొనేందుకు రిజిస్ట్రేఫన్ ఫీజు, ట్రాలెలింగ్, వసతితో పాటు ఇతర ఖర్చుల కోసం ఈ డబ్బు ఉపయోగించవచ్చు. 

Doodle 4 Google Contest

4. డూడుల్ 4 గూగుల్ కాంటెస్ట్ : 

గూగుల్ అందించే స్కాలర్ షిప్స్ లో బాగా పాపులర్ ఈ డూడుల్ 4 గూగుల్ కాంటెస్ట్. దీని ద్వారా స్కూల్ విద్యార్థుల్లో క్రియేటివిటిని తట్టిలేపేందుకు  ప్రయత్నిస్తోంది గూగుల్. 1 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ కాంటెస్ట్ లో పాల్గొనవచ్చు. గూగుల్ డూడుల్ ను సృజనాత్మకంగా పెయింటింగ్ చేసినవారిని విజేతలుగా ఎంపికచేసి ఆర్థిక సాయం చేస్తారు. 

మూడు కేటగిరీల్లో ఈ ఫోటీ వుంటుంది. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచినవారు రూ.5లక్షల వరకు సాయం పొందుతారు.  అలాగే  గ్రూప్ విన్నర్, నేషనల్ ఫైనలిస్ట్ లను కూడా ప్రకటిస్తారు.

ప్రతి ఏటా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో నిర్వహిస్తారు. 
 
 

Google India Code to Learn Contest

5. గూగుల్ ఇండియా కోడ్ టు లెర్న్ కాంటెస్ట్ : 

స్కూల్ విద్యార్థుల కోసం గూగుల్ నిర్వహించే మరో కాంటెస్ట్ ఇది. మూడు కేటగిరిల్లో పోటీ వుంటుంది. 5 నుండి 8వ తరగతి,  9 నుండి 10వ తరగతి, 11 నుండి 12వ తరగతి విద్యార్థులు ఈ కాంటెస్ట్ లో పాల్గోంటారు. విజేతలుగా నిలిచినవారు క్రోమ్ బుక్ లేదా అలాంటి మంచి గిప్ట్ ను పొందుతారు. 

ప్రతి ఏటా మే నుండి సెప్టెంబర్ మధ్యలో నిర్వహిస్తారు. 
 

click me!