దక్షిణ రైల్వేలో ఖాళీలు
దక్షిణ రైల్వే క్రీడా కోటా కింద 67 ఖాళీలను భర్తీ చేయనున్నారు... ఈ మేరకు ప్రకటన వెలువడింది. స్పోర్ట్ కోటాలో అంటే రన్నింగ్, చెస్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రికెట్ వంటి వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు (పురుషులు/మహిళలు) ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వంటి వివరాలను క్రింద ఇవ్వబడ్డాయి.
ఖాళీల వివరాలు
దక్షిణ రైల్వేలో మొత్తం 67 ఖాళీలు భర్తీ చేయబడతాయి, వీటిలో లెవల్ 1లో 46 ఖాళీలు, లెవల్ 2, 3లో 16 ఖాళీలు, లెవల్ 4,5లో 5 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు
విద్యార్హతలు ఉద్యోగాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కనీస విద్యార్హత 10వ తరగతి కాగా గరిష్టంగా డిగ్రీ. లెవల్-1 క్రీడా విభాగానికి దరఖాస్తు చేయాలంటే 10వ తరగతి లేదా ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి. లెవల్ 2 లేదా 3 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే 12వ తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. లెవల్ 4, 5 ఉద్యోగాలకు డిగ్రీ పట్టభద్రులు అర్హులు.
వయోపరిమితి
జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు జనవరి 1, 2025 నుండి లెక్కించబడుతుంది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్, OBC మరియు EWS కేటగిరీలకు దరఖాస్తు రుసుము రూ. 500. SC, ST, PwD కేటగిరీలు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు దరఖాస్తు రుసుము రూ. 250.
వేతన వివరాలు
దక్షిణ రైల్వేలో లెవల్ 1 స్థానాలకు కనీస వేతనం రూ. 18,000, లెవల్ 2 రూ. 19,900, లెవల్ 3 రూ. 21,700, లెవల్ 4 రూ. 25,500, లెవల్ 5 రూ. 29,200.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఈ రైల్వే ఉద్యోగాలకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 7 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 6. పరీక్ష తేదీని తర్వాత ప్రకటించనున్నారు.
ఎంపిక ప్రక్రియ
దక్షిణ రైల్వే క్రీడా కోటాకు ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష వుండదు... కేవలం శారీరక పరీక్షలు మాత్రమే ఉంటాయి. విద్యార్హతలు కలిగివుండి దరఖాస్తు చేసుకున్న క్రీడాకారులను మొత్తం 4 దశల్లో ఎంపిక చేస్తారు: క్రీడా విచారణ, శారీరక దృఢత్వ పరీక్ష, ధృవీకరణ పత్రాల పరిశీలన, చివరగా, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనే ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు https://iroams.com/ వెబ్‌సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకొండి.