టాటా సన్స్ ఛైర్మన్ ఇంకా ఏమన్నారంటే :
ఇవాళ (అక్టోబర్ 15, మంగళవారం) దేశ రాజధాని న్యూడిల్లీలో ఇండియన్ ఫౌండేషన్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (IFQM) సదస్సు ఏర్పాటుచేసారు. ఇందులో దేశంలోని దిగ్గజ సంస్థలైన టాటా సన్స్, టివిఎస్ మోటార్స్, సన్ ఫార్మా, మదర్సన్ గ్రూప్, భారత్ ఫోర్జ్,బోయింగ్ ఇండియా, బయోకాన్ కంపనీల ఛైర్మన్లు పాల్గొన్నారు.
కేవలం లాభాలు మాత్రమే చూసుకుకోవడం కాదు... భారతదేశ వ్యాపార రంగంలో క్వాలిటీ, ఇన్నోవేషన్ ను పెంపొందించేందుకు ఈ IFQM కృషిచేస్తోంది. ఇందుకోసం ప్రముఖ కంపనీల ప్రతినిధులంతా ఒక్కచోటికి చేరి ప్రత్యేక సదస్సులు ఏర్పాటుచేస్తారు. ఇలా ప్రస్తుతం న్యూడిల్లీలో ఈ సదస్సు జరుగుతోంది.
ఇందులో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన టాటా సన్స్ లక్ష్యాలను తెలియజేసారు... రాబోయే ఐదేళ్లలో ఏ రంగంలో తమ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుందో, ఈ క్రమంలో ఎన్ని లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారో టాటా సన్స్ ఛైర్మన్ వివరించారు.
ఇక ప్రస్తుతం దేశంలో మ్యానుఫ్యాక్ఛరింగ్ రంగాల్లో క్వాలిటీ పెంచుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఇందుకోసం నైపుణ్యం కలిగిన ఉద్యోగులు చాలా అవసరం అన్నారు. ప్రస్తుతం టాటా సన్స్ వివిధ రంగాల్లో పెట్టుబడులకు సిద్దమయ్యింది... కాబట్టి ఆ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల భర్తీకి సిద్దమైందని అన్నారు.
ప్రస్తుతం ప్రతినెల 1 మిలియన్ ప్రజలు వర్క్ ఫోర్స్ లోకి వస్తున్నారని... దీన్ని 100 మిలియన్స్ కు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని టాటా సన్స్ ఛైర్మన్ తెలిపారు. భారీ యువశక్తితో భారత్ ప్రపంచానికే మానవ వనరుల రాజధానిగా మారిందని చంద్రశేఖరన్ తెలిపారు.