64, 820 రూపాయల సాలరీతో ... ఎస్‌బిఐలో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ

First Published Sep 16, 2024, 11:59 PM IST

దేశంలోనే దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ బ్యాంకులో 1,511 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ భర్తీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... 

బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారిలో అత్యధికుల మొదటి ప్రాధాన్యత భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బిఐ). ఇలా  ఎస్‌బిఐలో జాబ్ కోరుకునే వారికి సువర్ణావకాశం వచ్చింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ కింద డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్), అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) పోస్టులను వివిధ గ్రేడ్‌లలో భర్తీ చేసేందుకు ఎస్‌బిఐ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎస్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ నియామక ప్రక్రియ ద్వారా ఎస్‌బిఐ 1511 ఖాళీలను భర్తీ చేయనుంది. మీరు కూడా ఎస్‌బిఐలో చేరాలని అనుకుంటే, అక్టోబర్ 4, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా కింద ఇవ్వబడిన అన్ని ముఖ్యమైన వివరాలను జాగ్రత్తగా చదవాలి.

Latest Videos


దరఖాస్తు చేసుకోవడానికి అర్హత

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియామకం 2024కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి.
 

ఎస్‌బిఐలో ఉద్యోగానికి వయోపరిమితి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు క్రింది విధంగా ఉండాలి.
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్) పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే జనరల్/EWS/OBC కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.750 చెల్లించాలి. SC/ST/PWBD అభ్యర్థులు ఎటువంటి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
 

జీతం
డిప్యూటీ మేనేజర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ.64,820, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480 జీతం చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు, అయితే డిప్యూటీ మేనేజర్ పోస్టుకు షార్ట్‌లిస్టింగ్-కమ్-ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

click me!