అర్హతలు :
సైనిక్ స్కూల్స్ ఆరోతరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఐదో తరగతి పాసయి మార్చి 31, 2025 నాటికి 10 నుండి 12 ఏళ్లలోపు వుండాలి. తొమ్మిదో తరగతి ప్రవేశానికి అయితే ఎనిమిదో తరగతి పాసయి 13 నుండి 15 ఏళ్లలోపు వయసుండాలి.
పరీక్ష విధానం :
ఆరో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.40 గంటల వరకు పరీక్ష వుంటుంది. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష వుంటుంది.
ఆరో తరగతి ప్రవేశానికి 125 ప్రశ్నలకు 300 మార్కులు వుంటాయి. లాంగ్వేజెస్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, మ్యాథ్స్ లో 50 ప్రశ్నలకు 150 మార్కులు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు వుంటాయి.
ఇక తొమ్మితో తరగతి ప్రవేశానికి 150 ప్రశ్నలకు 400 మార్కులు వుంటాయి. ఇందులో మ్యాథ్స్ 50 ప్రశ్నలకు 200 మార్కులు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లీష్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, సోషల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు వుంటాయి.