Career Guidance
Career Guidance : మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నారా? మంచి సంస్థలో, మంచి సాలరీతో ఉద్యోగం కావాలంటే అనేక విషయాలను మెరుగుపర్చుకోవాల్సి వుంటుంది. మీ రెస్యూమ్ నుండి కమ్యూనికేషన్స్ వరకు అన్నీ పర్ఫెక్ట్ గా వుంటేనే మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అంతేకాదు మీరు ఉద్యోగం చేయాలనుకునే సంస్థ, ఉద్యోగ బాధ్యతల గురించి ముందుగానే తెలిసివుండాలి. అయితేనే అప్లికేషన్ సమయంలో అయినా, ఇంటర్వ్యూలో అయినా కాన్ఫిడెంట్ గా వుండగలరు. అప్పుడే ఉద్యోగం మీ సొంతం అవుతుంది.
అయితే ఇలా మీ రెస్యూమ్ ను జాబ్ కు తగినట్లు ఎలా మార్చుకోవాలి? స్కిల్ ఎలా మెరుగుపర్చుకోవాలి? జాబ్ వివరాలు ఎలా తెలుసుకోవాలి? అని ఆలోచనలో పడ్డారా...కంగారుపడకండి చాట్ జిపిటిని ఆశ్రయించి అంతా సెట్ చేసుకోవచ్చు. ఇలా మీ కలల జాబ్ ను పొందేందుకు చాట్ జిపిటి ఎంతగానో ఉపయోగపడుతుంది.
చాట్ జిపిటి ద్వారా మీ ఉద్యోగ అవకాశాలను మెరుగుపర్చుకొండి. ఇందుకోసం ఈ క్రింది 9 ప్రాంప్ట్ ను ఉపయోగించి నాలెడ్జ్ పొందండి. చాట్ జిపిటి మీ కలల ఉద్యోగాన్ని పొందేందుకు సహకరిస్తుంది. తద్వారా తొందరగా జాబ్ పొంది లైఫ్ లో సెటిల్ కండి.
చాట్ జిపిటిని మీరు అడగాల్సిన వివరాలివే :
1. రెస్యూమ్ లో మార్పులుచేర్పులు :
మీ రెస్యూమ్ ను చాట్ జిపిటిలో పెట్టి ఏ కంపనీలో ఏ జాబ్ కు ప్రయత్నిస్తున్నారో దానికి అనుగుణంగా మార్చమని కోరాలి. దీంతో ఆ కంపనీ గతంలో మీరు ప్రయత్నించే జాబ్స్ కోసం ఎలాంటివారిని ఎంపికచేసింది... వారి అర్హతలను వివిధ మార్గాల ద్వారా సంగ్రహించి మీ రెస్యూమ్ ను సరిగ్గా ఆ జాబ్ కు సరిపోయేలా రూపొందిస్తుంది.
2. ప్రొఫెషనల్ సమ్మరీ:
నా రెస్యూమ్ ఆధారంగా జాబ్ కు సంబంధించిన ప్రొఫెషనల్ సమ్మరీని తయారుచేయమని చాట్ జిపిటికి ప్రాంప్ట్ ఇవ్వండి. మీ రెస్యూమ్ ను అందించండి. అప్పుడు మీ రెస్యూమ్ ఆధారంగా ప్రొఫెషనల్ సమ్మరీని చాట్ జిపిటి రూపొందిస్తుంది.
3. జాబ్ వివరాల గురించి :
మీరు ఏ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు అందుకు సంబంధించిన వివరాలను చాట్ జిపిటి ద్వారా తెలుసుకొండి. జాబ్ పేరు అందించి దీన్ని ప్రాథమిక బాధ్యతలు ఏమిటి? ఏ పనులు చేయాలి? అని చాట్ జిపిటికి ప్రాంప్ట్ ఇవ్వండి. అది అందించే జాబ్ డిస్క్రిప్షన్ లోంచి టాప్ 3 రిక్వైర్ మెంట్ ఎంచుకొండి.
4. రెస్యూమ్ లో ముఖ్యమైన విషయాలను పొందుపర్చడం :
మీ రెస్యూమ్ ను చాట్ జిపిటిలో పేస్ట్ చేసి ముఖ్యమైన విజయాలను బుల్లెట్ పాయింట్స్ రూపంలో పొందుపర్చాలని కోరండి. ప్రయత్నించే జాబ్ కు ఉపయోగపడే వాటిని మంచి బాష ఉపయోగించిన పొందుపర్చాలని కోరండి.
5.లింక్డిన్ సమ్మరీ :
రెస్యూమ్ ను పేస్ట్ చేసి లింక్డిన్ సమ్మరిని దీని ఆదారంగా రూపొందించాలని చాట్ జిపిటికి ప్రాంప్ట్ ఇవ్వండి.
6. జాబ్ అప్లికేషన్ :
రెస్యూమ్ ను ఫేస్ట్ చేసి జాబ్ కు సరిపోయేలా నాకు వున్న స్కిల్స్ ను గుర్తించాలని కోరండి. వాటిగురించి సంక్షిప్తంగా వివరించాలని కోరండి.
7. వ్యక్తిగత సమాచారం :
కంపనీ, జాబ్ వివరాలు తెలియజేసి వ్యక్తిగత వివరాల్లో వాటికి సరిపోయేవి గుర్తించాలని చాట్ జిపిటిని కోరండి. జాబ్ డిస్క్రిప్షన్ ను మీ ప్రస్తుత రెస్యూమ్ ను పేస్ట్ చేయండి.
8. ఇంటర్వ్యకు సిద్దం అయ్యేలా :
కంపనీ వివరాలు, జాబ్ పేరు అందించి మీ స్కిల్స్, అనుభవాల్లో వేటిగురించి మాట్లాడాలో చాట్ జిపిటిని కోరండి. దాని ఆదారంగా మీరు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలి? ఏ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి? అనేది తెలుసుకొండి.
9. సాధారణంగా ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు :
మీ జాబ్ టైటిల్ ను అందించి దీనికి సంబంధించి టాప్ 10 ఇంటర్వ్యూ ప్రశ్నలు అందించాలని చాట్ జిపిటికి ప్రాంప్ట్ ఇవ్వండి.
ఇలా చాట్ జిపిటి అందించిన సమాచారం ఆధారంగా రెస్యూమ్ ను పర్ఫెక్ట్ గా మార్చుకుని జాబ్ కు సరిపడా స్కిల్ప్ పొందండి. మీరు కోరుకునే జాబ్ పొందండి.