రూ.84,000 భారీ జీతంతో BHELలో ఉద్యోగాలు ... మీకు ఈ డిగ్రీ వుంటే వెంటనే అప్లై చేయండి

First Published | Dec 3, 2024, 9:34 PM IST

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ FTA గ్రేడ్ II (AUSC) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు BHEL వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 9, 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

BHEL Jobs

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. FTA గ్రేడ్ II (AUSC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు BHEL అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 9, 2024 న దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఆ తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు.
 

BHEL Jobs

తాజా నోటిఫికేషన్ ద్వారా బిహెచ్ఈఎల్ లో మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలు. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వయస్సును నవంబర్ 1, 2024 నాటికి లెక్కిస్తారు.

Latest Videos


BHEL Jobs

విద్యార్హతలు:

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో B.E./B.Tech./B.Sc. పూర్తి చేసి ఉండాలి. అన్ని సంవత్సరాలలో కలిపి కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను BHEL నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

BHEL Jobs

జీతం :

BHELలో FTA గ్రేడ్ II ఉద్యోగులకు నెలకు ₹84,000 జీతం లభిస్తుంది. అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. రూ.5 లక్షల వరకు మెడిక్లైమ్ పాలసీ, రూ.15 లక్షల గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ లభిస్తాయి. మరిన్ని వివరాలకు https://bhel.com చూడండి.

ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం BHEL నియామకాలు 2024 నోటిఫికేషన్ చూడండి. BHEL నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

click me!