రూ.1,35,020 సాలరీతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... 1267 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

Published : Jan 17, 2025, 08:05 PM IST

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మీరు ఈ కింది అర్హతలు కలిగివుంటే ఉద్యోగాలను పొందవచ్చు.

PREV
17
రూ.1,35,020 సాలరీతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... 1267 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
Bank of Baroda Jobs

బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఈ బ్యాంక్ కు దేశవ్యాప్తంగా 9,693 శాఖలు, 74,227 మంది ఉద్యోగులు వున్నారు. ఈ బ్యాంక్ ప్రధాన కార్యాలయం గుజరాత్‌లోని వడోదరలో వుంది. ఈ బ్యాంకులో ఉద్యోగం కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి యువతకు ఇది మంచి అవకాశం.

 

27
Bank of Baroda Jobs

ఉద్యోగాల భర్తీ : 

ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మొత్తం 1,267 ఖాళీలను భర్తీకి ప్రకటన వెలువడింది. రిటైల్‌లో 450, ఎమ్ఎస్ఎంఈలో 341, గ్రామీణ వ్యవసాయంలో 200, ఐటీలో 177, కార్పొరేట్ రుణాల్లో 30, డేటా మేనేజ్‌మెంట్‌లో 25, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో 22, ఫైనాన్స్‌లో 13, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో 9 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, జీతం వంటి వివరాలను చూద్దాం.

 

37
Bank of Baroda Jobs

విద్యార్హతలు:

డిగ్రీ / బి.ఎస్సీ / బి.ఈ / బి.టెక్ / సీఏ / సీఎంఏ / ఎం.ఎస్సీ / ఎంబీఏ / ఎంసీఏ / పీజీ డిప్లొమా / పీహెచ్‌డీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతలు మారుతాయి.

47
Bank of Baroda Jobs

వయస్సు:

24 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయోపరిమితిలో సడలింపు:

ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, జనరల్ విభాగంలోని దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు వుంటుంది.

57
Bank of Baroda Jobs

జీతం:

జూనియర్ మేనేజర్‌కు ₹48,480 నుండి ₹85,920 వరకు, మిడిల్ లెవెల్ ఉద్యోగాలకు ₹85,920 నుండి ₹1,05,280 వరకు, సీనియర్ మేనేజర్‌కు ₹1,20,940 నుండి ₹1,35,020 వరకు జీతం ఉంటుంది.

67
Bank of Baroda Jobs

దరఖాస్తు ఫీజు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ₹600 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ₹100 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం:

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటనలో ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు తెలియజేయబడ్డాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో 150 ప్రశ్నలకు 225 మార్కులకు 150 నిమిషాల సమయం ఉంటుంది. ఇంగ్లీష్ పరీక్ష కూడా ఉంటుంది.

77
దరఖాస్తుకు చివరి తేదీ

వెబ్‌సైట్:

https://www.bankofbaroda.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేదీ:

దరఖాస్తుకు ఈరోజే చివరి తేదీ. అర్హులైనవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

click me!

Recommended Stories