
Bank Jobs : శారీరక శ్రమ లేకుండా హాయిగా ఏసి రూముల్లో పనిచేసే వైట్ కాలర్ జాబ్స్ కి ఈకాలంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇలాంటి వాటిలో బ్యాంకింగ్ జాబ్స్ ఒకటి. టైమ్ టు టైమ్ పని, మంచి సాలరీ ఉండటంతో బ్యాంకు ఉద్యోగాలపై యువత ఆసక్తి చూపిస్తున్నారు... చాలామంది ఈ జాబ్స్ సాధించేందుకు ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటున్నారు. ఇలా బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి అవకాశం కల్పిస్తోంది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐలో ఉద్యోగం సాధించాలన్నది చాలామంది యువత కల. అలాంటిది ఈ బ్యాంకులో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 సంవత్సరానికి 541 PO (Probationary Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం డిగ్రీ విద్యార్హతతో మంచి హోదా, సాలరీ కలిగి ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి.
ఎస్బిఐ పీవో నోటిఫికేషన్, అప్లికేషన్స్ ప్రారంభం : జూన్ 24, 2025
దరఖాస్తుకు చివరి తేదీ : జూలై 14, 2025
దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరితేదీ : జూలై 14, 2025
ప్రిలిమినరీ పరీక్ష : జూలై లేదా ఆగస్ట్, 2025
ప్రిలిమినరీ పలితాలు : ఆగస్ట్/ సెప్టెంబర్ 2025
మెయిన్స్ పరీక్ష : సెప్టెంబర్ 2025
మెయిన్స్ పలితాలు : సెప్టెంబర్/అక్టోబర్ 2025
ఇంటర్వ్యూ, ఇతర టెస్టులు : అక్టోబర్ నుండి నవంబర్ మధ్య ఉంటాయి
ఫైనల్ రిజల్ట్ : డిసెంబర్ 2025 లో ఉండే అవకాశాలున్నాయి.
ఈ సంవత్సరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబెషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 541లో 500 రెగ్యులర్, 41 బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. రిజర్వేషన్ల వారిగా ఖాళీల వివరాలిలా ఉన్నాయి.
అన్ రిజర్వుడ్ - 203 పోస్టులు
ఎస్సి - 80 పోస్టులు (రెగ్యులర్ 75, బ్యాక్ లాగ్ 05)
ఎస్టి - 73 పోస్టులు ( రెగ్యులర్ 37, బ్యాక్ లాగ్ 36)
ఓబిసి - 135 పోస్టులు
ఈడబ్ల్యూఎస్ - 50 పోస్టులు
ఎస్బిఐ పీవో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి ఏదయినా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుండి డిగ్రీకి సమానమైన చదువు చదివిఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. కానీ ఇంటర్వ్యూ నాటికి డిగ్రీ పూర్తిచేసి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. చార్టెడ్ అకౌంటెంట్ (CA), ఇంజనీరింగ్, మెడికల్ డిగ్రీలు కలిగినవారు కూడా అర్హులే.
ఇప్పటికే ఎస్బిఐ పివో పోస్టుల భర్తీకి నోటిపికేషన్ వెలువడింది... జూన్ 24, 2025 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముందుగా ఎస్బిఐ అధికారిక వెబ్ సైట్ www.sbi.co.in ను సందర్శించండి.
పేజిని కిందకు స్క్రోల్ చేసి కెరీర్ పై క్లిక్ చేయండి. అప్పుడు కొత్తగా https://sbi.co.in/web/careers యూఆర్ఎల్ తో మరో స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
దీనిపై క్లిక్ చేయగానే ప్రస్తుత రిక్రూట్ మెంట్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో ప్రొబేషనరీ ఆఫీసర్స్ రిక్రూట్ మెంట్ ను ఎంచుకొండి. అక్కడ ఆన్ లైన్ అప్లైను ఎంచుకుని దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించండి. వ్యక్తిగత వివరాలు, ఎడ్యుకేషన్ అర్హతలతో పాటు అప్లికేషన్ ఫామ్ లో అడిగిన ఇతర వివరాలను పొందుపర్చండి.
అడిగిన పత్రాలతో పాటు సంతకం, ఫోటోలను తగిన సైజులోకి మార్చి అప్ లోడ్ చేయండి.
అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి.
మొత్తం పూర్తిచేసిన అప్లికేషన్ ఫామ్ ను మరోసారి చూసుకుని అన్నీ సరిగ్గా ఉన్నాయంటే సబ్మిట్ చేయండి. ఈ దరఖాస్తును భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకొండి.
దరఖాస్తు ఫీజు :
ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యూడి అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు
జనరల్, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ.750 ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్బిఐ ప్రొబెషనరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారి కనీస వయసు 21 ఏళ్లు నిండివుండాలి. గరిష్ట వయసు 30 ఏళ్లు. అంటే 02-04-1995 నుండి 01-04-2024 మధ్య పుట్టిఉండాలి.
ఓబిసిలకు 3 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. అలాగే ఎస్సి, ఎస్టిలకు 5 ఏళ్ళు వయో సడలింపు ఉంది. పిడబ్ల్యూబిడి అభ్యర్థులకు 10 నుండి 15 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 5 ఏళ్ళ వయో సడలింపు ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీవో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు.
1. ప్రిలిమినరీ పరీక్ష
2. మెయిన్స్ ఎగ్జామ్
3. ఇంటర్వ్యూ
స్టేట్ బ్యాంక్ ఇండియా పీవో ఉద్యోగాన్ని పొందినవారికి నెలకు రూ.80,000 నుండి 82,000 వరకు సాలరీ ఉంటుంది. మంచి సాలరీతో పాటు మంచి హోదా కలిగిన ఉద్యోగాలు కాబట్టి వీటికి పోటీ ఎక్కువగా ఉంటుంది.