Canara Bank Jobs 2025
కెనరా బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025
బ్యాంకింగ్ ఉద్యోగాలకు ఫ్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కెనరా బ్యాంక్ భారీ సాలరీతో ఉన్నతస్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది అద్భుత అవకాశం. ఏకంగా నెలకు రూ.1,50,000 నుంచి 2,25,000 వరకు జీతంతో కెనరా బ్యాంక్ లో ఉద్యోగాన్ని పొందవచ్చు.
Canara Bank Jobs 2025
కెనరా బ్యాంక్ లో ఖాళీలు:
కెనరా బ్యాంక్‌లో మొత్తం 60 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BE లేదా BTech పట్టా ఉండాలి. దీనితో పాటు, దరఖాస్తుదారుల వయస్సు గరిష్టంగా 35 ఏళ్లలోపు ఉండాలి.
Canara Bank Jobs 2025
ఎంపిక విధానం:
కెనరా బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు ఆన్‌లైన్ పరీక్ష రాయాలి. పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించి అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దాని ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
Canara Bank Jobs 2025
కెనరా బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్‌గా ఎంపికైన వారికి నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు జీతం లభిస్తుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మంచి జీతంతో బ్యాంక్ ఉద్యోగం చేయడానికి ఇది మంచి అవకాశం.
Canara Bank Jobs 2025
దరఖాస్తు విధానం:
కెనరా బ్యాంక్‌లో ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.canrabank.com కి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. దాన్ని ఉపయోగించి మిగతా వివరాలు నింపాలి. దరఖాస్తు సమర్పించేటప్పుడు ఆధార్ కార్డు, డిగ్రీ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరం.
Canara Bank Jobs 2025
దరఖాస్తుకు చివరి తేదీ:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 06-01-2025 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 24-01-2025.
కెనరా బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల గురించి మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన నోటిఫికేషన్ చూడండి.
కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్