ఏ‌పిసెట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2021 విడుదల: డిగ్రీ అర్హత వారు వెంటనే అప్లయి చేసుకోండీ..

First Published Sep 16, 2021, 3:59 PM IST

 ఏ‌పి‌ఎస్‌ఈ‌టి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఏ‌పి‌ఎస్‌ఈ‌టి  2021 కింద ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం కోసం లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకానికి సంబంధించిన  నోటిఫికేషన్ జారీ చేసింది. లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నియామకాల ఎలిజిబిలిటీ కోసం దరఖాస్తులు apset.net.inలో ఆగస్టు 11 నుండి 2021, సెప్టెంబర్ 13 వరకు స్వీకరించనున్నారు. 

 అయితే దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఇప్పుడు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కింద లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా అభ్యర్థులు యూ‌జి‌సి అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సమానమైన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా పిహెచ్‌డి డిగ్రీ లేదా యుజిసి నెట్ అర్హత ఉన్నవారు కూడా  ఈ‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓ‌బి‌సి, ఈ‌డబల్యూ‌ఎస్ కేటగిరీ అభ్యర్థులకి దరఖాస్తు రుసుము రూ .1,000. 

ఏ‌పి‌ఎస్‌ఈ‌టి 2021 ముఖ్యమైన తేదీలు

 ఏ‌పి‌ఎస్‌ఈ‌టి 2021 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11 ఆగస్టు 2021
లేట్ ఫీజు లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13 సెప్టెంబర్ 2021
లేట్ ఫీజు అండ్ రిజిస్ట్రేషన్ ఫీజుతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08 అక్టోబర్ 2021
ఏ‌పి‌ఎస్‌ఈ‌టి  2021 అడ్మిట్ కార్డ్ జారీ: 22 అక్టోబర్ 2021
ఏ‌పి‌ఎస్‌ఈ‌టి   2021 పరీక్ష తేదీ: 31 అక్టోబర్ 2021

ఏ‌పి‌ఎస్‌ఈ‌టి  2021 కోసం ఎలా దరఖాస్తు చేయాలి

అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్- apset.net.inని  సందర్శించండి.
హోమ్ పేజీ స్క్రీన్‌లో కనిపించే ఏ‌పి‌ఎస్‌ఈ‌టి  2021 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది.
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు సూచనలను పూర్తిగా చదవాలి.
ఆ తర్వాత అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన  పూర్తి వివరాలతో నింపవచ్చు.
అభ్యర్థులు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్ ఫీజు చెల్లించవచ్చు.
భవిష్యత్ రిఫరెన్స్ కోసం అభ్యర్థులు అప్లికేషన్ ఫారం కాపీని కలిగి ఉండాలి.

ఏ‌పి‌ఎస్‌ఈ‌టి  2021 కోసం ఎనిమిది పరీక్షా కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజబిలిటీ  టెస్ట్ 2021 కోసం ఎనిమిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసారు. ఇందులో విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు ఇతర ఉన్నాయి. పరీక్షకు దరఖాస్తు చేయడానికి గరిష్ట వయోపరిమితి లేదని అభ్యర్థులు గమనించాలి.

ఏ‌పి‌ఎస్‌ఈ‌టి  2021 టెస్ట్ పేపర్లు

ఏ‌పి‌ఎస్‌ఈ‌టి  టెస్ట్ ని మూడు గంటల పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ -1 జనరల్ దీనికోసం ఒక గంట టైమ్ ఇస్తారు. ఇందులో రీజనింగ్, ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, కమ్యూనికేషన్ వంటి సబ్జెక్ట్‌లు ఉన్నాయి. కాగా, పేపర్- II టైమ్ రెండు గంటలు. అభ్యర్థులు నిర్దిష్ట సబ్జెక్టు ఆంత్రోపాలజీ లేదా హిస్టరీ, ఇంగ్లీష్, ఇతరు పేపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ‌పి‌ఎస్‌ఈ‌టి  పరీక్ష 2021 కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్  apset.net.inని చెక్ చేస్తూ ఉండాలి. 

click me!