టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో తెలంగాణలో ఉద్యోగాలు.. అప్లయ్‌ చేసుకోవాడానికి క్లిక్ చేయండి..

First Published | Sep 14, 2021, 7:15 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం స్పోర్ట్స్‌ కోటా కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 55 పోస్టులను భర్తీ చేయనుంది. 

10వ తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 24 దరఖాస్తు చేసుకోవడానికి  చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://tsposts.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.
 

మొత్తం పోస్టుల సంఖ్య: 55
పోస్టల్‌ అసిస్టెంట్‌– 11, సార్టింగ్‌ అసిస్టెంట్‌– 08, పోస్ట్‌మ్యాన్‌/ మెయిల్‌ గార్డ్‌– 26, ఎంటీఎస్‌– 10

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత స్థానిక భాష వచ్చి ఉండాలి.
వయసు: పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్‌/పోస్ట్‌మ్యాన్‌/మెయిల్‌ గార్డ్‌ పోస్టులకు 18 నుంచి 27ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బేస్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, జూడో, కబడ్డీ, కరాటే, ఖోఖో, షూటింగ్‌ తదితరాలు.


క్రీడార్హతలు: సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థులు పాల్గొన్న క్రీడా ప్రాథమ్యాల ప్రాధాన్యతా క్రమం ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200
దరఖాస్తులకు చివరి తేది: 24 సెప్టెంబర్‌ 2021
అధికారిక వెబ్‌సైట్‌:https://tsposts.in/

Latest Videos

click me!