నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగావకాశాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ

First Published Oct 6, 2021, 3:13 PM IST

ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. దేశంలోని ప్రభుత్వ రంగా బ్యాంక్ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్  ని ముంబైలోని ఎస్‌బీఐకి చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం జారీ  చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2056 ఖాళీలను ప్రకటించింది. ఇందుల 2000 పోస్టులు రెగ్యుల‌ర్ నియామ‌కం కాగా 56 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 5 అక్టోబ‌ర్  2021 నుంచి 25 అక్టోబ‌ర్ 2021 వ‌ర‌కు గడువు ఇచ్చారు. 


అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. డిగ్రీ చివరి ఏడాది/చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చార్డర్ట్‌ అకౌంటెంట్‌/కాస్ట్‌ అకౌంటెంట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని పేర్కొంది.
 

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. అభ్య‌రర్ధులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ  ద్వారా ఎంపిక చేస్తారు. అర్హులైన వారికి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ న‌వంబ‌ర్ మ‌ధ్య‌వారంలో నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్ 2021 మొద‌టి లేదా రెండో వారంలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే సమయంలో రూ.2 లక్షల బాండ్ రాసి ఇవ్వాలి. బాండ్ ప్రకారం అభ్యర్థులు కనీసం మూడేళ్లు బ్యాంకుకు సేవలు అందించాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం రెగ్యుల‌ర్‌ ఖాళీలు- 2000
ఎస్సీ- 300
ఎస్టీ- 150
ఓబీసీ- 540
ఈడ‌బ్ల్యూఎస్ - 200
జనరల్- 810

మొత్తం బ్యాక్‌లాగ్ ఖాళీలు - 56
ఎస్సీ- 24
ఎస్టీ- 12
ఓబీసీ- 20
 

వయసు: 2021 ఏప్రిల్‌ 01 నాటికి 21 నుంచి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్‌సి,ఎస్‌టిలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం: ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీనిని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. మూడు సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ - 30 ప్రశ్నలు- 20 నిమిషాలు

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - 35 ప్రశ్నలు - 20 నిమిషాలు

రీజనింగ్‌ ఎబిలిటీ - 35 ప్రశ్నలు - 20 నిమిషాలు

ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌ టైప్‌ టెస్టులు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ టైప్‌ పరీక్ష సమయం 3 గంటలు. దీనిలో నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం మార్కులు 200.
 

రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ - 45 ప్రశ్నలు- 60 మార్కులు- 60 నిమిషాలు

డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంట్రప్రిటేషన్‌ - 35 ప్రళ్నలు - 60 మార్కులు- 45 నిమిషాలు

జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ - 40 ప్రశ్నలు-40 మార్కులు- 35 నిమిషాలు

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ - 35 ప్రశ్నలు- 40 మార్కులు- 40- నిమిషాలు

డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌(లెటర్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌) నుంచి 50 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 30 నిమిషాలు. మెయిన్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

ఇంటర్వ్యూ: 2022 ఫిబ్రవరి 2/3వ వారం

 పరీక్షా కేంద్రాలు : తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి.


అధికారిక వేబ్‌సైట్‌: https://sbi.co.in/

click me!