Andhra pradesh: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతోన్న‌ వారికి పండ‌గే.. 10 వేల‌కిపైగా పోస్టులు

Published : Mar 19, 2026, 10:27 AM IST

Andhra pradesh: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కూట‌మి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఏ తేదీన ఏ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ రానుందో అధికారికంగా ప్రకటించారు.  

PREV
14
10 వేలకుపైగా ఉద్యోగాలు.. 25 శాఖల్లో భర్తీ

2026-27 ఏడాదికి గాను విడుద‌ల చేసిన జాబ్ క్యాలెండర్‌లో మొత్తం 10,000కుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. సుమారు 25 శాఖల్లో ఈ నియామకాలు జరుగనున్నాయి. నోటిఫికేషన్లు ఇచ్చే సమయంలో ఎలాంటి న్యాయ సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

24
నెలల వారీగా నోటిఫికేషన్ల షెడ్యూల్

ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వివిధ తేదీల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి:

మే 15 – ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టులు

ఆగస్టు 15 – హోంశాఖలో 2,778 పోస్టులు, ఇతర శాఖల్లో 928 పోస్టులు, గ్రూప్-1లో 91 పోస్టులు

సెప్టెంబర్ 15 – గ్రూప్-2లో 750 పోస్టులు, అదనంగా ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన పోస్టులు

అక్టోబర్ 15 – పాఠశాల, ఇంటర్ విద్యాశాఖల్లో 3,000కుపైగా పోస్టులు

ఈ షెడ్యూల్ ద్వారా అభ్యర్థులు ముందుగానే తమ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

34
డీఎస్సీ, రాబోయే నియామకాలపై ప్రత్యేక దృష్టి

జాబ్ క్యాలెండర్ విడుదల వెంటనే టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. రాబోయే మూడు సంవత్సరాల్లో వరుసగా డీఎస్సీల ద్వారా సుమారు 7,500కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసే ప్రణాళికను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

44
మంత్రి నారా లోకేష్ సందేశం

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ప్రతి ఉగాదికి ఉద్యోగాల ప్రకటన చేస్తామని, అభ్యర్థులు సులభంగా సిద్ధం కావడానికి సిలబస్ ముందుగానే అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే ఉద్యోగార్థులు స్కిల్ పోర్టల్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నోటిఫికేషన్ అలర్ట్స్ నేరుగా అందుతాయని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories