స్పెయిన్‌లో బద్ధలైన అగ్నిపర్వతం.. ఇళ్లలోకి వచ్చిన లావా.. 5వేల మంది తరలింపు

First Published Sep 20, 2021, 7:11 PM IST

స్పెయిన్‌లోని లా పాల్మా దీవిలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. భూకంపం తర్వాత లావా ఆకాశంలోకి కనీసం ఓ వంద మీటర్లు ఎగసిపడింది. తర్వాత నదిని తలపిస్తూనే కిందికి ప్రవహించింది. దారికి అడ్డువచ్చిన ఇళ్లు, రోడ్లు, అన్నింటినీ కబళించుకుంటూ ముందుకు వెళ్లింది. ఈ భయానక దృశ్యాలను చూసి స్థానికులు ఆందోళనలో మునిగిపోయారు. అధికారులు కనీసం ఐదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

volcano

స్పెయిన్‌కు చెందిన కెనరీ దీవి లా పాల్మాలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. దీనికి ముందు 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. తర్వాత గంటల వ్యవధిలోనే లావా ఆకాశంలోకి చిమ్ముతూ కనిపించింది. కనీసం వంద మీటర్ల ఎత్తుకు లావా ఎగసిపడింది. తర్వాత ఏరుల్లాగే కిందికి పారుతూ వచ్చింది. అడ్డువచ్చిన ప్రతిదాన్ని కప్పేస్తూ భస్మం చేస్తూ పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే సమీపంలోని నివాసాల్లోనూ లావా వచ్చి చేరింది. చూస్తుండగానే ఇళ్లు దగ్ధమైపోయాయి. ఈ భయానక దృశ్యాలు భీతి గొల్పుతున్నాయి.

volcano

లా పాల్మా దీవిలో సుమారు 85వేల మంది నివసిస్తున్నారు. దీవి కావడంతో ఎక్కువ మంది పర్వతప్రాంతాల్లోనే ఆవాసాలు ఏర్పరుచుకున్నారు. కాబెజా డివాకా ప్రాంతంలో పర్వతం కేంద్రకంగా భూమి కంపించి లావా బయటకు వచ్చింది. ఆదివారం సాయంత్రం నుంచి నిరంతరాయంగా లావా ఉప్పొంగుతూనే ఉన్నది. చివరిసారిగా 50ఏళ్ల క్రితం అంటే 1971లో ఈ పర్వతం నుంచి లావా ఎగసింది. తాజాగా మళ్లీ ఇప్పుడే బయటికి వచ్చింది.

volcano

అకాస్మాత్తుగా భూమి కంపించడం, అగ్నిపర్వతం బద్ధలవ్వడం, లావా ఎగసిపడటం, నదిలా ప్రవహిస్తూ ఇళ్లను బూడిద చేస్తున్న వైనం చూస్తూ స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 

volcano

అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అటువైపుగా వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అటువైపుగా వెళ్తున్న రోడ్లను మూసేశారు. లావా దాటికి కనీసం 100కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. కనీసం ఐదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

volcano

స్థానికులు ఈ భీకర దృశ్యాలు చూసి హడలిపోతున్నారు. ఈ లావా కనీసం 22 యుద్ధ విమానాలు చేసే శబ్దంతో నదిలా పరుగులు పెడుతున్నదని చెబుతున్నారు.

volcano

In spains la palma islan volcano erupted on sunday. Lava flowing like a river towards down. houses becoming ashes

click me!