బంపర్ ఆఫర్లు : బరువు తగ్గితే బంగారం.. నడిచివెడితే నగదు, పండ్లూ, కూరగాయలు తింటే ప్రోత్సాహకాలు.. ఎక్కడంటే..

First Published Jul 27, 2021, 10:53 AM IST

సగటున ఒక్కొక్కరు నాలుగు కిలోలు పెరిగినట్లు అక్కడి ‘నేషనల్ హెల్త్ సర్వే(ఎన్హెచ్ఎస్)’ అంచనా వేసింది. దీంతో దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం  అక్కడి పౌరులకు సన్నబడాలని సూచించింది.

కరోనా తెచ్చిపెట్టిన సమస్యల్లో బరువు పెరగడం ఒకటి.. సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా అనేకమంది ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉంటే నోటికి పని చెప్పడం మానవ సహజం. దీంతో చాలా మంది బరువు పెరిగారు. యూకేలో నిర్వహించిన ఓ సర్వేలో 41 శాతంమంది తాము లావయ్యామని అంగీకరించారు.
undefined
సగటున ఒక్కొక్కరు నాలుగు కిలోలు పెరిగినట్లు అక్కడి ‘నేషనల్ హెల్త్ సర్వే(ఎన్హెచ్ఎస్)’ అంచనా వేసింది. దీంతో దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అక్కడి పౌరులకు సన్నబడాలని సూచించింది.
undefined
ఈ మేరకు ప్రభుత్వం తరఫున కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎన్హెచ్ఎస్ సిద్ధమైంది. ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. టీవీలో జంక్ ఫుడ్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలపై నియంత్రణ విధించింది. ఆహార పదార్థాల్లో ఉండే క్యాలరీల వివరాల్ని అందరికీ తెలియజేసేలా పోస్టర్లు పెట్టాలని హోటళ్లు, రెస్టారెంట్లు ఫుడ్ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది.
undefined
మధ్యాహ్న భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా చర్యలు చేపడుతోంది. జంక్ ఫుడ్ లపై పన్నులు పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది. కానీ ప్రధాని బోరిస్ జాన్సన్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బరువు తగ్గడానికి ఉపయోగపడే యాప్ లు, ప్రణాళికలను, ఎన్హెచ్ఎస్ ప్రోత్సహిస్తోంది. అలాగే బరువును తగ్గించు తగ్గించుకునేందుకు ఉపయోగపడే ఆహారపదార్థాల తయారీకి సంబంధించిన ప్రకటనలను టీవీల్లో ఇస్తోంది.
undefined
అందుకే, ప్రజలు బరువు తగ్గి.. ఆరోగ్యంగా ఉండటం కోసం బ్రిటన్ ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది. బ్రిటన్ పౌరుల్లో ఎవరైతే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారో.. వారికి నగదు ప్రోత్సాహకాలు, బోనస్లు, డిస్కౌంట్ కూపన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
undefined
జంక్ ఫుడ్ తినడం మానేసి, ఎక్కువ కూరగాయలు, పండ్లు తినేవారికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారట. ఊబకాయంపై పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు ప్రభుత్వం చెబుతోంది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సైతం ఈ కార్యక్రమంలో భాగమై బరువు తగ్గుతానని ప్రతిజ్ఞ చేశారు.
undefined
ఈ ప్రోత్సాహకాలను అర్హులను ఎంపిక చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా సూపర్ మార్కెట్లలో పౌరుల నెలవారీ కొనుగోళ్లు లెక్కలను విశ్లేషించానున్నారు. ఎవరైతే జంక్ ఫుడ్ ను తగ్గించి కూరగాయలు, పండ్లు కొనుగోలు చేస్తారో.. వారిని గుర్తించి యాప్ ద్వారానే లాయల్టీ పాయింట్లు ఇస్తారు.
undefined
విద్యా సంస్థలకు, ఆఫీసులకు వాహనాల్లో కాకుండా కాలినడకన వెళితే అదనంగా మరికొన్ని పాయింట్లు లభిస్తాయి. అలా వచ్చిన పాయింట్లను క్యాష్ బ్యాక్ రూపంలో నగదుగా మార్చుకోవచ్చు. లేదా డిస్కౌంట్ ఫ్రీ టికెట్స్ పొందొచ్చు. ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం అమలుకు యాప్ అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
undefined
ఇలాంటి కార్యక్రమమే దుబాయిలో కొన్నేళ్ల కిందటి నుంచి అమలు చేస్తున్నారు. అక్కడ కూడా ఊబకాయం, అధిక బరువు సమస్యలు ఉండడంతో ఈ వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. పౌరులు తమ శరీర బరువులో ఎన్ని కిలోలు తగ్గితే అన్ని గ్రాముల బంగారం ఇస్తున్నారు.
undefined
ఇలాంటి కార్యక్రమమే దుబాయిలో కొన్నేళ్ల కిందటి నుంచి అమలు చేస్తున్నారు. అక్కడ కూడా ఊబకాయం, అధిక బరువు సమస్యలు ఉండడంతో ఈ వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. పౌరులు తమ శరీర బరువులో ఎన్ని కిలోలు తగ్గితే అన్ని గ్రాముల బంగారం ఇస్తున్నారు.
undefined
click me!