డేటింగ్ గేమ్ కిల్లర్ : 130మంది దారుణ హత్య, పట్టించిన చెవిపోగులు, ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తూ జైల్లోనే మృతి..

First Published Jul 26, 2021, 3:07 PM IST

1977-1979 మధ్యకాలంలో కాలిఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అల్కల హత్య చేసిన ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక అల్కల అమెరికా వ్యాప్తంగా దాదాపు 130మందిని హత్య చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

కాలిఫోర్నియాలో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్న.. ‘డేటింగ్ గేమ్ కిల్లర్’ గా ప్రసిద్ధి చెందిన ఓ హంతకుడు శనివారం మరణించినట్లు జైలు అధికారులు తెలిపారు. రోడ్నీ జేమ్స్ అల్కల (77) కాలిఫోర్నియాలోని శాన్ జోక్విన్ వ్యాలీలోని ఆస్పత్రిలో సహజ కారణాలతో మరణించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.
undefined
1977-1979 మధ్యకాలంలో కాలిఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అల్కల హత్య చేసిన ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక అల్కల అమెరికా వ్యాప్తంగా దాదాపు 130మందిని హత్య చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.
undefined
2013లో న్యూయార్క్ లో మరో ఇద్దరిని నరహత్య చేసినందుకుగాను అల్కలాకు అదనంగా మరో 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. 1977 మృతుల్లో వ్యోమింగ్‌ ప్రాంతంలో లభించిన ఓ 28 ఏళ్ల మహిళ మృతదేహానికి సంబంధించిన కేసులో డీఎన్‌ఏ ఆధారంగా అల్కలా ప్రమేయం వెలుగుచూడటంతో అతడికి 2016లో మరోసారి శిక్ష విధించారు.
undefined
ఆరు నెలల గర్భవతి హత్యకేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. ఉరిశిక్ష విధించినప్పటికి అల్కలా మెడికల్ సంరక్షణ నిమిత్తం జైలులో కాక అతడి నివాసంలోనే ఎక్కువకాలం ఉన్నాడు. గావిన్ న్యూసోమ్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఉరిశిక్షపై తాత్కాలిక నిషేధం విధించారు. అధికారులు .. అల్కల తాను హత్య చేసిన మహిళల చెవిపోగులను ట్రోఫీలు గా తీసుకునే వాడని తెలిపారు.
undefined
గతంలో అల్కల ధరించిన బంగారు చెవి రింగులు తన కుమార్తె రాబిన్ సామ్సో కు చెందినవని ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన మహిళ చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
undefined
కానీ అల్కలా మాత్రం చెవిపోగులు తనవేనని వాటిని 1978లో తాను ధరించినట్లు ‘ది డేటింగ్ గేమ్’ టీవీషో లో కనిపించిన ఒక క్లిప్ ను చూపించాడు. చనిపోవడానికి దాదాపు ఒక సంవత్సరం ముందే తాను ఈ బంగారు చెవి పోగులు ధరించానని కోర్టుకు తెలిపాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు.
undefined
దర్యాప్తుదారులు ఒక బాధితురాలి డిఎన్ఏ.. అల్కల దగ్గర ఉన్న గులాబిరంగు చెవి పోగు లో గుర్తించడమే కాక సామ్సో శరీరంలో అల్కలా డీఎన్ఏ గుర్తించారు. ఈ కేసులో అతడికి రెండు సార్లు మరణశిక్ష విధించారు..
undefined
కానీ రెండు నేరారోపణలు తారుమారు చేయబడ్డాయి. ఒకటి రెండు దశాబ్దాల తరువాత, ఇతర ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా, నలుగురు మహిళల హత్యలకు సంబంధించి అల్కలాపై అభియోగాలు మోపారు. తీర్పు తర్వాత, అధికారులు అల్కలా ఆధీనంలో ఉన్న యువతులు, బాలికలకి చెందిన 100కి పైగా ఫోటోలను విడుదల చేశారు.
undefined
click me!