కాందహార్ మసీదుపై దాడి: ఆఫ్ఘనిస్తాన్‌లో సామూహిక అంత్యక్రియలు.. చిత్రాలివే

First Published Oct 17, 2021, 6:33 PM IST

ఆఫ్ఘనిస్తాన్‌లో శుక్రవారం షియాలు ప్రార్థన చేసే మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో అనధికారికంగా 67 మంది మరణించినట్టు తెలిసింది. ఈ దాడిలో మరణించినవారికి కుటుంబ సభ్యులు శనివారం సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు.
 

afghanistan, mass funeral

న్యూఢిల్లీ: Afghanistanలోని కాందహార్ నగరంలో షియాలు ప్రార్థనలు చేసే mosqueపై ఆత్మాహుతి దాడి జరిగింది.శుక్రవారం జరిగిన ఈ దాడిలో 47 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తాలిబాన్ ప్రభుత్వం  తెలిపింది. అయితే,స్థానికులు ఈ సంఖ్య 63గా చెబుతున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో  చాలా మంది చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం విషమంగా ఉన్నావారూ ఉన్నారని వివరించారు. 

afghanistan, mass funeral

శుక్రవారం ఈ దాడిలో మరణించినవారి మృతదేహాలకు కుటుంబీకులు శనివారం last rites నిర్వహించారు. పదుల సంఖ్యలో ఉండటంతో వారందరినీ సామూహికంగా ఖననం చేశారు. తమ ప్రాణాలను రక్షించాలని ఆ  కుటుంబ సభ్యులు తాలిబాన్లను అభ్యర్థించారు.
 

afghanistan, mass funeral

ఆఫ్ఘనిస్తాన్‌ చరిత్ర పొడుగునా రక్తమోడుతూనే ఉన్నది. వలసవాదానికి ముందు నుంచే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దుస్థితిని
ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా మద్దతులో అధికారంలో ఉన్న అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూలదోసి Talibanలు అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 20ఏళ్ల యుద్ధం కొంతకాలమైనా సద్దుమణుగుతుందని భావిస్తున్న తరుణంలో మరో ఉగ్రముప్పు ఇప్పుడు ఆ దేశాన్ని వణికిస్తున్నది. ఐఎస్‌కేపీ 
రూపంలో తాలిబాన్లకు ముప్పు ఎదురవుతున్నది.

afghanistan, mass funeral

కాందహార్ ప్రావిన్స్‌లోని ఫాతిమియా మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు ఐఎస్‌కేపీ ఓ ప్రకటన చేసింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అతి పెద్ద దాడిగా దీన్ని పేర్కొంటున్నారు.

ఐఎస్‌కేపీ క్రమంగా దాని ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నది. ఇప్పుడు నార్త్, కాబూల్‌లోనూ పట్టు సంపాదించుకుంటున్నది. అయితే, ఈ ముప్పును తాలిబాన్లు ఎదుర్కొనగలరా? లేదా? అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.

click me!