Womens Day 2025: పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండే టాప్ 10 దేశాలు

Published : Mar 08, 2025, 05:46 PM ISTUpdated : Mar 08, 2025, 07:41 PM IST

International Womens Day 2025:  చాలా దేశాల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ కొన్నిదేశాల్లో ఇందుకు రివర్స్ లో మగవాళ్ల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి టాప్ 10 దేశాల గురించి తెలుసుకుందాం. ఇంతకూ మనదేశంలో ఎవరు ఎక్కువగా ఉన్నారో తెలుసా?  

PREV
110
Womens Day 2025:  పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండే టాప్ 10 దేశాలు
Ukraine

1. ఉక్రెయిన్ :

దేశ జనాభాలో ఆడవాళ్లు ఎక్కువగా ఉండే టాప్ టెన్ దేశాల్లో ఉక్రెయిన్ ఉంది. రష్యాతో యుద్ధం వల్ల చాలామంది సైనికులు చనిపోయారు... కానీ అంతకు ముందునుండే ఇక్కడ మహిళల జనాభా ఎక్కువ. 

210
Russia

2. రష్యా :

రష్యాలో కూడా మగవాళ్ల కంటే ఆడవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఈ దేశంలో కూడా ఉక్రెయిన్ తో యుద్దంలో చాలామంది చనిపోయారు. కానీ అంతకంటే ముందునుండే ఇక్కడ ఆడవాళ్లు ఎక్కువగా ఉన్నారు.

 

310
Nepal

3. నేపాల్

మన పక్కనే ఉన్న నేపాల్ దేశంలో 100 మంది ఆడవాళ్లకి 84 మంది మగవాళ్లే ఉన్నారు. ఈ దేశ మొత్తం జనాభాలో ఆడవాళ్లే  54.19% ఉన్నారు... ఇక మగవాళ్లు కేవలం 46 శాతమే ఉన్నారు.

410
Hong Kong

4. హాంకాంగ్

2019లో హాంకాంగ్ లో ఆడవాళ్ల జనాభా 54.12% ఉంది. 2021 రిపోర్ట్ ప్రకారం ఇక్కడ 100 మంది ఆడవాళ్లకి 84.48 మంది మగవాళ్లు ఉన్నారు.

510

5. కురాకావో

కురాకావోలో 100 మంది ఆడవాళ్లకి 92 మంది మగవాళ్లు ఉన్నారు. 2019లో ఈ దేశ జనాభా 1.64 లక్షలు. ఇందులో 89 వేల మంది ఆడవాళ్లు ఉన్నారు.

610
Martinique

6. మార్టినిక్

ఇక్కడ 2021లో 100 మంది ఆడవాళ్లకి 85.01 మంది మగవాళ్లు ఉన్నారు. 2019 రిపోర్ట్ ప్రకారం ఇక్కడ 3.75 లక్షల జనాభా ఉంది.

710
Latvia

7. లాట్వియా

లాట్వియాలో 53.91% మంది ఆడవాళ్లు ఉన్నారు. 2019లో ఇక్కడ 1,886,000 జనాభా ఉంది. ఇందులో 1,017,000 మంది ఆడవాళ్లు ఉన్నారు.

810
Guadeloupe

8. గ్వాడెలూప్

2019లో గ్వాడెలూప్ లో 53.88% మంది ఆడవాళ్లు ఉన్నారు. 2021 రిపోర్ట్ ప్రకారం ఇక్కడ 100 మంది ఆడవాళ్లకి 89.2 మంది మగవాళ్లు ఉన్నారు.

910
Lithuania

9. లిథువేనియా

2019లో లిథువేనియాలో 53.72% మంది ఆడవాళ్లు ఉన్నారు. 2021 వరకు ఇక్కడ 100 మంది ఆడవాళ్లకి 86.18 మంది మగవాళ్లు ఉన్నారు.

1010
Belaras

10. బెలారస్

ఇక్కడ 2020లో 100 మంది ఆడవాళ్లకి 87.12 మంది మగవాళ్లు ఉన్నారు. జనాభా 94.49 లక్షలు. ఇందులో 50.50 లక్షల మంది ఆడవాళ్లు ఉన్నారు.

click me!

Recommended Stories