తండ్రి శవపేటిక ముందు ఫొటో షూట్ చేసిన ఇన్ స్టా స్టార్.. మండిపడుతున్న ఫాలోవర్స్...

First Published Oct 30, 2021, 7:40 AM IST

ఓ యువతి  జ్ఞానం మరిచి స్వయంగా కన్న తండ్రి అంత్యక్రియల్లోphoto shootలో పాల్గొని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అల్ట్రా మాడ్రన్ డ్రెస్సులో తండ్రి శవం పక్కన నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. 

ఫ్లోరిడా : అర్జెంటుగా నేమ్, ఫేమ్ కావాలని అడ్డమైన పనులూ చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువై పోయింది. కుప్పి గెంతులు వేయడం.. ఏదో కాంట్రావర్సీ మాట్లాడడం.. ఎవరూ చేయని, చేయలేని చిత్రవిచిత్రమైన.. జుగుస్స కలిగించే పనులు చేసి తమ ఫాలోవర్స్ ను షాక్ చేయడం.. తద్వారా నెగెటివ్ కామెంట్స్ తో రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోవడం తరచుగా కనిపిస్తోంది.

social media తో జరుగుతున్న ఓ వికృతంలో ఇదీ ఒకటి. ఎలాంటి మాధ్యమాలైనా మనం వాడుకునే విధానాన్ని బట్టే ఉంటాయి. whatsapp, instagram, facebook లాంటి సామాజిక మాధ్యమాలను మనం ఎలా వాడుకుంటాం అనేదాన్ని బట్టే వాటి మంచి, చెడు ఉంటుంది. 

చాలా మంది ఈ మాధ్యమాలను ఉపయోగించుకుని చాలా లాభపడుతున్నారు. అనుకోని విధంగా ఫేమస్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో తమ ఫోటోలు పోస్టు చేసి నెటిజన్లను ఆకట్టుకుంటూ ఫాలోవర్లను పెంచుకోవడంలో తప్పు లేదు. కానీ, ఎక్కడా, ఎప్పుడూ, ఎలా? ఫొటో షూట్ చేసుకోవాలనే ఇంగిత జ్ఞానం ఉండాలి. 

కానీ, ఓ యువతి ఆ జ్ఞానం మరిచిపోయింది. స్వయంగా కన్న తండ్రి అంత్యక్రియల్లోphoto shootలో పాల్గొని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అల్ట్రా మాడ్రన్ డ్రెస్సులో తండ్రి శవం పక్కన నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. వివరాల్లోకి వెడితే...

Jayne Rivera

ఫ్లోరిడాలోని మియామికి చెందిన ఇరవై యేళ్ల సోషల్ మీడియా సెలబ్రిటీ జేని రివెరా తండ్రి ఇటీవల వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియల్లో భాగంగా మృతదేహాన్ని శవపేటికలో పెట్టారు. అయితే, శవపేటిక ముందు 
Jenny Rivera ఫ్యాషన్ దుస్తులు ధరించి, వివిధ భంగిమల్లో నవ్వుతూ ఫొటోలు దిగి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

తన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన ఫాలోవర్లు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి dead body వద్ద ఫొటో షూట్ ఏంటని మండిపడ్డారు. 

మరణించిన తండ్రికి కనీసం మర్యాద ఇవ్వలేదని విమర్శించారు. ఆ ఫొటోలు తొలగించి, క్షమాపణ చెప్పకపోతే ఇన్ స్టాలో ఫాలో అవడం మానేస్తామని మరి కొందరు హెచ్చరించారు. అయితే, వీటన్నింటిని జెనీ లైట్ గా తీసుకుంది. ఏమీ సమాధానం ఇవ్వలేదు. 

కానీ Netizens నుంచి వస్తున్న విమర్శల వరద ఆగలేదు. దీంతో నెటిజన్ల నుంచి వస్తున్న నెగెటివ్ కామెంట్స్ ను భరించలేక రివెరా ఏకంగా instagram accountను డియాక్టవేట్ చేసింది. అయితే, నెటిజన్లకు ఎలాంటి వివరణ, క్షమాపణ చెప్పకుండానే ఖాతాను  Deactivate చేయడం గమనార్షం. 

click me!