అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: వైట్‌హౌస్‌కి ట్రంప్ రెండోసారి దూరం కావడానికి కారణాలివీ....

First Published Nov 8, 2020, 11:55 AM IST

కర్ణుడి చావుకు కారణాలు అనేకం అనేది నానుడి. మహాభారత యుద్ద సమయంలో కర్ణుడి మరణానికి అనేక కారణాలు ఉన్నట్టుగానే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమికి కూడ అనేక కారణాలను చెబుతారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన తప్పులే ఆయనను అధ్యక్ష పీఠానికి రెండోసారి దూరం చేశాయనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష పీఠం చేజిక్కుంచుకొన్న నాటి నుండి ఎన్నికల్లో ఓటమిపాలయ్యేవరకు ట్రంప్ అనేక వివాదాస్పద నిర్ణయాలను తీసుకొన్నారు. ప్రతిరోజూ ఏదో ఒక నిర్ణయంతో ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచేవారు.
undefined
కరోనా వైరస్ ట్రంప్‌నకు ఇబ్బందిగా మారింది. కరోనా పట్ల ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కరోనాను అదుపు చేయడంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం చెందిందనే విమర్శలు కూడ లేకపోలేదు.
undefined
కరోనా విషయంలో ట్రంప్ తీసుకొనే నిర్ణయాలపై ఆ దేశానికి చెందిన అంటువ్యాధుల నిపుణుడు అంతోని ఫౌచీ ట్రంప్ పై చేసే విమర్శలు కూడ ఆయనకు నష్టం కల్గించాయి. ఫౌచీపై ట్రంప్ కూడ ఒంటికాలిపై విమర్శలు గుప్పించేవాడు.
undefined
ఎన్నికలకు ముందుగానే వ్యాక్సిన్ వస్తోందని ట్రంప్ ప్రకటించాడు. కానీ సాధ్యం కాలేదు. కరోనా వ్యాక్సిన్ కోసం ఆపరేషన్ వార్ స్పీడ్, నిరుద్యోగులకు కంపెనీలకు ప్రత్యేక ప్యాకేజీలను ట్రంప్ చేపట్టినా ఆశించిన ఫలితం దక్కలేదు.
undefined
ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఎన్నికల ప్రచార సమయంలోనే ట్రంప్ కు కరోనా సోకింది. దీంతో అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న బైడెన్, ట్రంప్ మధ్య రెండో డిబెట్ వాయిదా కూడ పడింది.
undefined
మాస్క్ లేకుండా ట్రంప్ పర్యటించడం కూడ వివాదాస్పదమైంది. వైట్ హౌస్ లో మహమ్మారుల వ్యాప్తి సమయంలో స్పందించే అత్యవసర బృందాన్ని ట్రంప్ 2018లో రద్దు చేయడం వల్ల కూడ దేశంలో కరోనా వ్యాప్తి చేయడానికి కారణంగా కూడ చెబుతారు.
undefined
జార్జ్ ఫ్లాయిడ్ హత్య సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు అగ్నికి ఆజ్యం పోసేదిగా ఉందనే విమర్శలు చెలరేగాయి. నల్లజాతీయులకు భద్రత కల్పించే విషయంలో చర్యలకు విరుద్దంగా ట్రంప్ చేసిన ప్రకటన ఆందోళనకారుల్లో మరింత ఆగ్రహన్ని నింపింది. ఆందోళనకారులను ఉగ్రవాదులతో పోల్చడం కూడ వివాదాస్పదమైంది. ఆందోళనలను అణచేందుకు అవసరమైతే మిలటరీని కూడ వాడుతామని ప్రకటించారు ట్రంప్.
undefined
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతో వైట్ హౌస్ వద్ద నల్లజాతీయులు ఆందోళనకు దిగారు.ఈ సమయంలో ట్రంప్ వైట్ హౌస్ బంకర్ లో దాక్కొన్నారు.ట్రంప్ నకు ఎలాంటి పాలన అనుభవం లేకపోవడం కూడ ఇబ్బందిగా మారింది. ఆయన కార్యవర్గంలో పనిచేసిన అధికారులు అతి తక్కువ కాలానికి వైదొలిగారు.
undefined
ఐరోపా, అస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అమెరికాకు దూరమయ్యేలా ట్రంప్ నిర్ణయాలు తీసుకొన్నారు. ఐరోపా నుండి వచ్చే స్టీల్, ఆటోమొబైల్ వంటి వాటిపై భారీ టారీఫ్ లు విధించారు.
undefined
జీ20, నాటో కూటముల్లో ట్రంప్ హయాంలో అమెరికా తన స్థాయిని తగ్గించుకొందనే అభిప్రాయాలు అమెరికాలో నెలకొన్నాయి. ఐరోపా దేశాలు సైనిక కూటమిగా ఏర్పడాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన ప్రకటించడం పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.
undefined
అమెరికా వీసా నిబంధనలను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినతరం చేసింది. దేశీయంగా ఉద్యోగాలను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పినా కూడ చౌకగా కార్మికులు, ఉద్యోగులను పొందే అవకాశం లేకుండా పోయింది.వివిధ వృత్తుల్లో నైపుణ్యం ఉన్నవారి సేవలను వినియోగించుకొనే అవకాశాలు కూడా బిగించివేశారు.
undefined
click me!