ప్రపంచంలో అత్యంత రహస్య ప్రదేశాలు.. 24/7 హై సెక్యూరిటీలో ఉంటాయి. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది?

Published : Feb 15, 2026, 02:40 PM IST

High security places: ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు సాధారణ ప్రజలకు పూర్తిగా నిషేధిత ప్రాంతాలుగా ఉంటాయి. ఇవి కేవలం సెక్యూరిటీ కారణాల వల్లే కాదు, ప్రపంచ భద్రత, రక్షణ వ్యవస్థ, కీలక సమాచారం వంటి అంశాలతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. 

PREV
17
ఏరియా 51 – రహస్య ప్రయోగాల కేంద్రం

Area 51 అమెరికా నెవాడా రాష్ట్రంలో ఉన్న అత్యంత రహస్య ప్రదేశం. ఇక్కడ ప్రత్యేక రకమైన యుద్ధ విమానాలు, ఆధునిక సాంకేతిక ప్రయోగాలు జరుగుతాయని చెబుతారు. ఈ ప్రాంతం చుట్టూ ఆయుధాలతో గస్తీ దళాలు, డ్రోన్లు, ఉపగ్రహ నిఘా వ్యవస్థలు ఉంటాయి. అనుమతి లేకుండా దగ్గరికి వెళ్లినా కఠిన చర్యలు తీసుకుంటారు.

27
షాంఘై స్మార్ట్ గ్రిడ్ – చైనా అత్యాధునిక విద్యుత్ నెట్‌వర్క్

షాంఘై స్మార్ట్ గ్రిడ్ చైనాలోని అత్యంత ఆధునిక విద్యుత్ పంపిణీ వ్యవస్థ. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా సాంకేతికతలతో పనిచేస్తుంది. విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడం, పునర్వినియోగ శక్తిని సమన్వయం చేయడం దీని లక్ష్యం. ఇక్కడ లక్షల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి . ప్రతి కదలికపై నిఘా ఉంటుంది. సిస్టమ్‌లో ఏ చిన్న లోపం వచ్చినా పెద్ద స్థాయిలో ప్రభావం పడే అవకాశం ఉండటంతో భద్రత అత్యంత కఠినంగా ఉంటుంది.

37
చెయెన్ మౌంటెన్ కాంప్లెక్స్ – అమెరికా అణు రక్షణ కేంద్రం

చెయెన్ మౌంటెన్ కాంప్లెక్స్ అమెరికాలోని కీలక అణు రక్షణ కేంద్రం. ఇది భూగర్భంలో నిర్మించారు. అణు దాడుల సమయంలో కూడా సురక్షితంగా పనిచేసేలా రూపొందించారు. ఈ కేంద్రం గేట్లు దాదాపు 25 టన్నుల బరువుంటాయి. పూర్తిగా సీల్ చేసే విధంగా తయారు చేశారు. అత్యాధునిక నిఘా వ్యవస్థలు ఇక్కడ పనిచేస్తుంటాయి. అనుమతి లేకుండా ప్రవేశించడం అసాధ్యం.

47
వాటికన్ గోప్య ఆర్కైవ్స్

వాటికన్ గోప్య ఆర్కైవ్స్ ప్రపంచంలో అత్యంత రహస్య పత్రాలు ఉన్న ప్రదేశంగా గుర్తింపు పొందింది. శతాబ్దాల నాటి మత సంబంధిత డాక్యుమెంట్లు ఇక్కడ భద్రపరిచారు. కొద్ది మంది అధికారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రతి కదలికను కంట్రోల్ రూమ్ నుంచి గమనిస్తారు.

57
కొరియా డీఎంసీ సరిహద్దు

Korean Demilitarized Zone ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉన్న అత్యంత సున్నిత ప్రాంతం. ఇక్కడ భారీగా సైన్యం మోహ‌రించి ఉంటుంది. ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున 24 గంటలు కఠిన నిఘా ఉంటుంది.

67
గూగుల్ డేటా సెంటర్

గూగుల్ నిర్వహించే గూగుల్ డేటా సెంర్ ది డ‌ల్లాక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాను నిల్వ చేసే కేంద్రాల్లో ఒకటి. బయోమెట్రిక్ లాక్‌లు, మోషన్ సెన్సర్లు, కెమెరాలు ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తాయి. చాలా కొద్దిమందికి మాత్రమే ప్రత్యక్ష ప్రవేశం ఉంటుంది.

77
స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్

స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్ అనేది నార్వేలో ఉన్న ప్రపంచ విత్తన బ్యాంక్. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన పంటల విత్తనాలను భద్రపరుస్తుంది. ప్రకృతి విపత్తులు, యుద్ధాలు జరిగినా భవిష్యత్తులో పంటలను తిరిగి పునరుద్ధరించేందుకు ఇది కీలకం. భూగర్భంలో నిర్మించబడిన ఈ కేంద్రం అత్యంత భద్రతతో పనిచేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories