దుబాయ్ అగ్నిప్రమాదం : తమ ముస్లిం స్నేహితుల కోసం ఇప్తార్ సిద్ధం చేస్తూ.. భారతీయ జంట మృతి...

First Published | Apr 17, 2023, 12:02 PM IST

అగ్నిప్రమాదం సమయంలో కేరళకు చెందిన రిజేష్ కలంగదన్ (38), అతని భార్య జేషి కందమంగళత్ (32) తమ ఇరుగుపొరుగు ముస్లిం స్నేహితుల కోసం ఇప్తార్ సిద్ధం చేస్తున్నారు.

దుబాయ్ : దుబాయ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 16 మంది మృతి చెందిన విషాదం గురించి తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ దంపతులు తమ పొరుగువారి కోసం ఇఫ్తార్ విందును సిద్ధం చేస్తున్నారని మీడియా కథనాలు తెలుపుతున్నాయి. కేరళకు చెందిన రిజేష్ కలంగదన్ (38), అతని భార్య జేషి కందమంగళత్ (32) ఈ ఘటనలో మృతి చెందారు. శనివారం సాయంత్రం వీరు తమ ఇరుగుపొరుగు ముస్లిం స్నేహితుల ఉపవాసాన్ని ముగించేందుకు హిందువుల పంట పండుగ భోజనమైన విషుసాధ్యను సిద్ధం చేస్తున్నారు.

అల్ రాస్ ప్రాంతంలో జరిగిన మంటల్లో కనీసం 16 మంది మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు, భవనం భద్రతా అవసరాలకు అనుగుణంగా లేకపోవడం దీనికి కారణమని దుబాయ్ సివిల్ డిఫెన్స్ పేర్కొంది. కలంగదన్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా ఉన్నారు, కందమంగళత్ స్కూల్ టీచర్‌గా ఉన్నారు. దంపతులు శనివారం విషు వేడుకలు జరుపుకున్నారు. 


వారు అరటి ఆకులో వడ్డించే శాఖాహార పండుగ విందు అయిన విషుసాధ్యను తయారు చేస్తున్నారు. రంజాన్ ఉపవాసం ఉన్న తమ ముస్లిం పొరుగువారితో పాటు, కేరళ నుండి బ్రహ్మచారుల బృందాన్ని ఇఫ్తార్ కోసం ఆహ్వానించారని గల్ఫ్ న్యూస్ తెలుపుతోంది.

అపార్ట్‌మెంట్ లో నంబర్ 409లో ఏడుగురు రూమ్‌మేట్స్‌తో కలిసి నివసించే రియాస్ కైకంబం... మాట్లాడుతూ 406లో నివసించే జంట.. మంటలు చెలరేగిన ఫ్లాట్ 405లో ఉండేవారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారని చెప్పారు. దంపతులు తమ పండుగల సమయంలో కైకంబం అతని రూమ్‌మేట్‌లను ఆహ్వానించేవారు.

onam 2022

ఇంతకు ముందు కూడా ఓనం, విషు లంచ్‌ల సమయంలో మమ్మల్ని ఆహ్వానించారు. ఈసారి రంజాన్‌ కావడంతో ఇఫ్తార్‌కు రమ్మని చెప్పారు. కైకంబం ఆ జంటను తమ అపార్ట్‌మెంట్ బయటే చివరిసారి చూశానని చెప్పాడు. "నేను టీచర్ ఏడుస్తూ ఉండడం చివరిసారి చూశాను" అని అతను గుర్తుచేసుకున్నాడు, ఆ జంట ఆ తరువాత తమ స్టూడియో ఫ్లాట్‌లోకి తిరిగి వెళ్ళారు.

"తర్వాత కాల్‌లకు స్పందన లేదు. మధ్యాహ్నం 12.35 గంటలకు  వాట్సాప్‌లో చివరగా రిజేష్ చివరిగా స్టేటస్‌ చూసినట్టు గమనించాను. ఆదివారం నా ఫ్లైట్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి నాకు సహాయం చేశాడు. నన్ను ఇఫ్తార్ కోసం ఆహ్వానించాడు. అలాంటి వ్యక్తి అతని భార్యతో పాటుచనిపోయాడని నేను నమ్మలేకపోతున్నాను" అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. 

అగ్నిప్రమాదం సమయంలో ఇంట్లో లేని అతని రూమ్‌మేట్ సుహైల్ కోపా ఇలా అన్నాడు: "మా పొరుగువారిని కోల్పోవడం మమ్మల్ని చాలా కృంగిదీస్తోంది. మేము ప్రతిరోజూ కలుసుకునేవాళ్లం, హాయిగా పలకరించుకునే వాళ్లం. అలాంటివారు ఇక లేరన్న వార్త తట్టుకోలేకపోతున్నాం. ఆ బిల్డింగ్ లో మాతోపాటు కలిసి ఉన్న 16 మంది పొరుగువారిని మేము కోల్పోయాం. వారిలో కొందరు మాతో చాలా క్లోజ్ గా ఉండేవారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

What Is Iftar During Ramadan

శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ రూమ్‌కు అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిందని అధికారులు తెలిపారు. వెంటనే దుబాయ్ సివిల్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ నుండి ఒక బృందం మంటలు చెలరేగిన ప్రదేశానికి చేరుకుంది.  భవనం నుండి నివాసితులను ఖాళీ చేయించడం ప్రారంభించింది. పోర్ట్ సయీద్ ఫైర్ స్టేషన్, హమ్రియా అగ్నిమాపక కేంద్రం నుండి బృందాలను కూడా పిలిపించారు. స్థానిక కాలమానం ప్రకారంమధ్యాహ్నం 2:42 గంటలకు మంటలు ఆర్పేశారు. మధ్యాహ్నం 3 గంటలకు, సివిల్ డిఫెన్స్ బృందం క్రేన్ల ద్వారా మూడవ అంతస్తులో ఉన్నవారిని రక్షించింది.

Latest Videos

click me!