గిన్నిస్ రికార్డ్ ల్లో కెక్కిన.. గుమ్మడికాయంత మామిడికాయ.. ! బరువెంతంటే...

First Published May 4, 2021, 2:46 PM IST

ఆ మామిడి కాయను చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే.. పెద్ద గుమ్మడికాయంత సైజులో నిజంగానే పళ్లలో రారాజుగా వెలిగిపోతోంది. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే తనకంటే గొప్పది లేదని చాటుకుంది. 

ఆ మామిడి కాయను చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే.. పెద్ద గుమ్మడికాయంత సైజులో నిజంగానే పళ్లలో రారాజుగా వెలిగిపోతోంది. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే తనకంటే గొప్పది లేదని చాటుకుంది.కొలంబియాలోని ఓ రైతు దంపతుల తోటలో పండిన మామిడిపండు ఫుట్బాల్ అంత సైజు ఉంది. మొదట అది ఇంత పెద్దగా పెరుగుతుందని వారు అనుకోలేదట. రోజురోజుకు పెరుగుతూ ఉంటే ఎంత పెరుగుతుందో చూద్దామని అలాగే వదిలేశారట.
undefined
ఆ సైజు చూసి వాళ్లే ఆశ్చర్యపోయారు. అది పెరిగి పెరిగి చివరికి ప్రపంచంలోనే అతిపెద్ద మామిడికాయ అయింది. ఈ విషయం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారికి తెలిసింది. వెంటనే వారు కొలంబియా వచ్చారు.కొలంబియాలోని గ్వాయటాలో ఉన్న జర్మన్ ఓర్లాండో నావోయా, రైనా మారియా మర్రోకన్ దంపతులను కలిశారు. మామిడికాయను బరువు తూచారు. అది 4.25 కేజీలు ఉంది. దీంతో దాన్ని గిన్నీస్ బుక్ లో ఎక్కించారు.
undefined
ఇంతకుముందు 2009లో ఫిలిప్పీన్స్‌లో ఓ మామిడిపండు పెద్దగా కాసింది. దాని బరువు 3.435 కేజీలు ఉంది. ఇప్పటివరకు దాని పేరుమీదే గిన్నీస్ రికార్డ్ ఉంది. ఇప్పుడు దాన్ని ఈ పండు తిరగరాసింది.ఇదంతా ఆ రైతు దంపతుల కూతురు వల్లే జరిగింది. మామిడికాయ పెద్దగా పెరగడాన్ని గమనించిన ఆమె ప్రపంచంలో పెద్ద మామిడికాయ ఏది అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసింది. ఆ రిజల్ట్స్ తమదే అతిపెద్దది అని తేల్చింది. దీంతో వెంటనే గిన్నీస్ బుక్ వారికి విషయం చెప్పింది. వారు కూడా వెంటనే స్పందించి కొలంబియాకు వచ్చారు.
undefined
ఈ రికార్డును సాధించాక ఆ కుటుంబం ఆ మామిడికాయను కోసి అందరికీ పంచిపెట్టింది. ఈ సందర్భంగా ఆ కుటుంబం ఇలాంటిదే మరో మామిడికాయ మున్సిపాలిటీ అధికారులకు ఇచ్చి, గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన విషయాన్ని తెలిపారు.అయితే ఈ మున్సిపాలిటీ ఇది రెండో గిన్నిస్ రికార్డ్. 2014లో ప్రపంచంలోనే అతి పెద్ద సహజమైన ఫ్లవర్ కార్పొరేట్ అవార్డు కూడా ఈ మున్సిపాలిటీకే వచ్చింది. అంతకుముందున్న 3,1999 చదరపు మీటర్ల రికార్డును ఇది తిరగరాసింది.
undefined
click me!