అద్భుతం : కోవిడ్ యాంటీబాడీస్ తో పుట్టిన చిన్నారి.. అంతా దానివల్లే..

First Published Apr 27, 2021, 1:33 PM IST

ప్రస్తుతం ప్రపంచాన్ని మహమ్మారి వణికిస్తున్న తరుణంలో కోవిద్ 19 బారిన పడకుండా ఉండాలంటే టీకాలే ఉత్తమమైన మార్గం. సెకండ్ వేవ్, కరోనా ఉత్పరివర్తన వైరస్ లు తీవ్రస్థాయిలో భయపెడుతున్నాయి.  

ప్రస్తుతం ప్రపంచాన్ని మహమ్మారి వణికిస్తున్న తరుణంలో కోవిద్ 19 బారిన పడకుండా ఉండాలంటే టీకాలే ఉత్తమమైన మార్గం. సెకండ్ వేవ్, కరోనా ఉత్పరివర్తన వైరస్ లు తీవ్రస్థాయిలో భయపెడుతున్నాయి.
undefined
ఈ సెకండ్ వేవ్ చిన్న పిల్లలమీద కూడా అధిక ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి సమయంలో ఓ డాక్టర్ కరోనా యాంటీబాడిస్ ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఇది మిరాకిల్, అద్భుతం అంటూ అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ డాక్టర్ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
undefined
న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూరోబయాలజీ అండ్ బిహేవియర్‌లో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ ప్రేరణా శ్రేష్ట తనకు పుట్టిన బిడ్డకు కరోనా యాంటీబాడీస్‌ ఉన్నాయన్న సంతోషకరమైన వార్తను సోషల్ మీడియాలో పంచుకున్నారు,
undefined
విషయం ఏంటంటే.. ప్రేరణా శ్రేష్ట గర్బిణిగా ఉన్న సమయంలో కోవిడ్ టీకా వేయించుకుంది. ఇప్పుడు పుట్టిన నవజాత శిశువులో కోవిడ్ స్పైక్ ప్రోటీన్ ను ఎదుర్కొనే యంటీ బాడీస్ ఉన్నాయని పరీక్షల్లో తేలింది.
undefined
దీంతో ప్రేరణా శ్రేష్ట విపరీతమైన సంతోషంలో ఉంది. సైన్సు ధన్యవాదాలు. అందరూ గర్భిణీ సమయంలో టీకా అంటే భయపడతారు. నేను ఆ సాహసం చేసినందుకు నాకీ అద్భుతం జరిగింది అంటూ ఉద్వేగానికి లోనయ్యింది.
undefined
పాలిచ్చేతల్లులు, గర్బిణులు టీకాలు వేసుకోవద్దని నిబంధన ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్తితుల్లో వీరికీ అనుమతినిస్తున్నాయి చాలా దేశాలు. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నవారికి హైరిస్క్ నుదృష్టిలో పెట్టుకుని ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

డాక్టర్ శ్రేష్ట, తన ఫాలో-అప్ ట్వీట్లలో, తాను ఫైజర్-ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ డబుల్-డోస్ వేసుకున్నానని అది కూడా తన ప్రెగ్నెన్సీ చివరి నెలల్లో అని చెప్పుకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ యాంటీ బాడీస్ తో పిల్లలు పుట్టడం నిజంగా మిరాకిల్ అనే చెప్పాలి. ఇది కొత్తగా తల్లులు కాబోతున్న వారికి శుభవార్త.
undefined
ఈ సెకండ్ వేవ్ తీవ్రస్తాయిలో ఉండడంతో నవజాత శిశువులతో పాటు పదిహేను వారాల వయస్సు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు కూడా కోవిడ్ 19 బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ సంఘటనతో గర్భధారణ సమయంలో COVID-19 టీకాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయని, ఇతరులు కూడా దీనిని అనుసరించాలని వైద్యులు కోరారు.
undefined
టీకాలు వేసిన గర్భిణీలకు పుట్టిన పిల్లలు కొన్ని ప్రతిరోధకాలను పొందొచ్చని మరికొన్ని అధ్యయనాల్లో తేలింది. దీనిద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులు తమ నవజాత శిశువులకు పాలు ఇస్తున్నంత కాలం.. కోవిడ్ నుంచి రక్షణ కల్పించే సూపర్ పవర్ ను అందించినట్టేనని అంటున్నారు.

click me!