జెరుసలేంలో ఉద్రిక్తత : అల్ అక్సా మసీదులో ఘర్షణ, 305మందికి గాయలు, 20 మంది మృతి !

First Published May 11, 2021, 9:44 AM IST

పవిత్ర నగరం జెరూసలేం లోని అల్ అక్సా మసీదు ప్రాంగణం లో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇజ్రాయిల్ పోలీసులు, పాలస్తీనా పౌరులు పరస్పరం ఘర్షణకు దిగారు. 

పవిత్ర నగరం జెరూసలేం లోని అల్ అక్సా మసీదు ప్రాంగణం లో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇజ్రాయిల్ పోలీసులు, పాలస్తీనా పౌరులు పరస్పరం ఘర్షణకు దిగారు. రాళ్లు విసురుతున్న పాలస్తీనా వాసులను చెదరగొట్టేందుకు ఇజ్రాయిల్ పోలీసులు భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు, స్టన్‌ గ్రెనేడ్లు ప్రయోగించారు.
undefined
ఈ ఘటనలో 305 మందికి పైగా పాలస్తీనియన్లు గాయపడ్డారు. వీరిలో 228 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. మొత్తం 20 మంది ఘర్షణల్లో మరణించారని ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
undefined
మరోవైపు 21 మంది పోలీసులు గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. ఏడుగురు ఇజ్రాయిల్‌ పౌరులు కూడా గాయాలపాలైన ట్లు తెలిపారు.
undefined
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పరమ పవిత్రమైన క్షేత్రాల్లో అల్‌–అక్సా మసీద్‌ కూడా ఒకటి. రంజాన్ మాసంలో ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో పాలస్తీనా భక్తులు వస్తుంటారు.
undefined
జెరూసలేంలో కొన్ని వారాలుగా పాలస్తీనావాసులు, ఇజ్రాయిల్ భద్రతా దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.
undefined
తూర్పు జెరుసలెం శివారులోని షేక్ జెర్రాలో పాలస్తీనా ప్రజల నివాసాలను ఇజ్రాయిల్ సెటిలర్లు ఆక్రమించుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
undefined
ఆగ్రహంతో రగిలిపోతున్న పాలస్తీనియన్లు సోమవారం ఉదయం ప్రార్థన సందర్భంగా ఇజ్రాయిల్ పోలీసులపై విరుచుకుపడ్డారు. మసీదు బయట గస్తీ కాస్తున్న పోలీసులపై రాళ్లు విసిరారు.
undefined
దీంతో పోలీసులు ప్రతి దాడికి దిగారు. అల్‌–అక్సా ప్రాంగణం రణరంగాన్ని తలపించింది పాలస్తీనా ప్రజల విషయంలో ఇజ్రాయిల్‌ తీరును అంతర్జాతీయ సమాజం తప్పు పడుతోంది.
undefined
అల్‌–అక్సా మసీద్ కాంపౌండ్ నుంచి ఇజ్రాయిల్‌ దళాలు వెనక్కి వెళ్లిపోవాలని గాజాలో ని సంస్థ హమాస్ మిలిటెంట్ సంస్థ డిమాండ్ చేసింది. అనంతరం జెరూసలేంలో వైమానిక దాడుల సైరన్లు, పేలుళ్ల మోతలు వినిపించాయి. దీంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు.
undefined
భారీ పేలుడుతో ఉత్తర గాజా స్ట్రిప్ సోమవారం వణికిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారని అధికారులు ప్రకటించారు .పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. గాజా లోని హమాస్‌ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్ను ప్రయోగించిన ట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా వైమానిక దాడులకు దిగుతామని ఇజ్రాయెల్ తెలిపింది.
undefined
click me!