Beer price: ఆకాశన్నింటిన బీర్‌ ధరలు.. గోవాకు మనకు ఎంత తేడానో తెలుసా.?

Published : Feb 12, 2025, 11:29 AM ISTUpdated : Feb 12, 2025, 12:16 PM IST

సమ్మర్‌లో చల్లగా బీర్‌ వేద్దామని అనుకుంటున్న మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో బీరు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన ధరలు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీరు ధరలు ఏమేర పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
13
Beer price: ఆకాశన్నింటిన బీర్‌ ధరలు.. గోవాకు మనకు ఎంత తేడానో తెలుసా.?
Image Credit: Getty Images

సమ్మర్‌లో బీర్ల అమ్మకాలు పెరగడం సర్వసాధారణం. ఓ లెక్క ప్రకారం ప్రతీ 5గురు మందు ప్రియుల్లో ముగ్గురు బీర్ తాగుతున్నారంటా. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు బీర్లకు ఎంత డిమాండ్‌ ఉంటుందో. వేడి వాతావరణంలో చల్లగా బీర్‌ వేద్దామని ఆశించే వారి జేబులకు చిల్లు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీర్‌పై ఏకంగా 15 శాతం వరకు పెంచారు. సమ్మర్‌లో బీర్ల అమ్మకాలు పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వా ఖజానాకు అదనంగా నెలకు రూ. 300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ధరలను పెంచాలని లిక్కర్ కంపెనీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మల్టీనేషనల్ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్‌ ధర మీద కనీసం 30 శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే బీర్ల ధరల పెంపుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ 15 నుంచి 19 శాతం వరకు ధరలను పెంచొచ్చని నివేదిక అందించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బేసిక్‌ ధరలు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
 

23

కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే.. 

* ఎక్కువ మంది బీర్‌ ప్రియులు ఇష్టపడే కింగ్‌ ఫిషర్‌ లైట్‌ ధర గతంలో రూ. 150 ఉండగా ప్రస్తుతం ర. 172కి పెరిగింది. 

* ఇక కేఎఫ్‌ స్ట్రాంగ్‌ బీర్‌ ధర ఇంతకు ముందు  రూ. 160 కాగా, ప్రస్తుతం రూ. 184కి పెరిగింది. 

* కేఎఫ్‌ అల్ట్రా మ్యాక్స్‌ బీరు ధర రూ. 220 ఉండగా, రూ. 253కి పెరిగింది. 

* బడ్వైజర్‌ లైట్‌ ధర మొన్నటి వరకు రూ. 210 ఉండగా ఇప్పుడు రూ. 241కి పెరిగింది. 

* బడ్వైజర్ మ్యాగ్నం ధరను రూ. 220 నుంచి రూ. 253కి పెంచారు. 

* ఇక టూబర్గ్‌ స్ట్రాంగ్‌ బీర్‌ ధర రూ. 240 ఉండగా ఇప్పుడు రూ. 276కి పెంచారు. 

ఇది కూడా చదవండి: ఆకాశన్నింటిన బీర్‌ ధరలు.. గోవాకు మనకు ఎంత తేడానో తెలుసా.?

33

గోవాలో ధరలు ఎలా ఉన్నాయంటే.. 

ఇదిలా ఉంటే గోవాలో మద్యం ధరలు తక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. ఇంతకీ గోవాలో ప్రస్తుతం బీర్ల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

* గోవాలో కింగ్‌ఫిషర్ ప్రీమియం లాగర్ బీర్ ధర రూ. 120గా ఉంది. 

* అలాగే బిరా 91 బ్లాండ్ ధర రూ. 120గా ఉంది. 

* బడ్‌వైజర్ మాగ్నమ్ స్ట్రాంగ్ బీర్ ధర రూ. 120గా ఉంది. 

* కార్ల్స్‌బర్గ్ ఆల్ మాల్ట్ ప్రీమియం బీర్ ధర రూ. 120కాగా కార్ల్స్‌బర్గ్ ఎలిఫెంట్ స్ట్రాంగ్ సూపర్ ప్రీమియం బీర్ సైతం రూ. 120గా ఉంది. 

* కింగ్‌ఫిషర్ అల్ట్రా లాగర్ బీర్ రూ. 150, టుబోర్గ్ గ్రీన్ బీర్: రూ. 110గా ఉంది. 

నోట్‌: పైన తెలిపిన ధరల వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. గోవాలో స్థానికంగా ఆయా ప్రాంతాల్లో కొంతమేర మార్పు ఉండొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories