
ఎండాకాలంలో డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. వేడి వాతావరణం రక్తంలో చక్కెర స్థాయిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగొచ్చు లేదా పూర్తిగా తగ్గొచ్చు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి ఈ ఎండాకాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎండాకాలంలో నీటిని పుష్కలంగా తాగకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయి. డీహైడ్రేషన్ కారణంగా శరీరంలో నీరు లేనప్పుడు కొన్ని ముఖ్యమైన హార్మోన్లు అసమతుల్యతకు గురవుతాయి. ఇది ఒకేసారి రెండు సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. మొదటిది నిర్జలీకరణం, రెండోది రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం. ఎండాకాలంలో చాలా మంది చక్కెరను ఎక్కువగా తీసుకుంటారు. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టం.
ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, స్వీట్స్ వంటి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. డయాబెటిస్ పేషెంట్లు ఎండాకాలంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నీళ్లను ఎక్కువగా తాగాలి, యోగా చేయండి
ఎండాకాలంలో నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. మన శరీరంలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కూడా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఈ సీజన్ లో ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలి. ఇది ఇతర ఉదర సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ప్రతిరోజూ సమయానికి నిద్రలేవాలి. యోగా, వ్యాయామం చేయాలి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.
భోజన సమయాన్ని సెట్ చేయండి
ఎండాకాలంలో తినడానికి, తాగడానికి నిర్ణీత సమయం ఉండాలి. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య బ్రేక్ ఫాస్ట్ ను చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్యాహ్న భోజనం తినాలి. రాత్రిళ్లు 8 గంటలకు భోజనాన్ని తినాలి. ఇలా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమైతుంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఈ గంటల మధ్య చేయడం వల్ల మీ శరీరానికి తగిన శక్తి అందుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.
పండ్లను తినండి
ఎండాకాలంలో మన శరీరానికి నీళ్లు ఎక్కువ అవసరమవుతాయి. ఇది మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి. అందుకే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ, ఖర్బూజ, నారింజ, ద్రాక్ష వంటి జ్యూసీ ఫ్రూట్స్ ను తప్పకుండా తినండి. దీనివల్ల మీ శరీరానికి నీటి సరఫరా సమానంగా కొనసాగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.
రాతి ఉప్పు
ఎండాకాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు స్నాక్స్ తినండి. వీటితో పాటు బ్లాక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ ను కూడా తీసుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే రాతి ఉప్పును తీసుకోవాలి. వీళ్లు ఖాళీ కడుపుతో ఎక్కువ సేపు ఉండకూడదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి బాగా పెరుగుతుంది.
ఆకుపచ్చ కూరగాయలు తినండి
తాజా, ఆకుపచ్చ కూరగాయలను ఎండాకాలంలో ఎక్కువగా తినాలి. ఆకుపచ్చ కూరగాయలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాకరకాయ, సొరకాయ వంటి కూరగాయలను తినాలి.