గుండెజబ్బులు రావొద్దంటే వీటిని ఖచ్చితంగా తినండి..

Published : Apr 22, 2023, 02:51 PM IST

ఆల్కహాల్, సిగరేట్, పేలవమైన ఆహారం వంటివి  గుండె  జబ్బులను కలిగిస్తాయి. నిశ్చలజీవన శైలి, ఒత్తిడి కూడా గుండెను ప్రమాదంలో పడేస్తాయి.  అయితే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.   

PREV
18
గుండెజబ్బులు రావొద్దంటే వీటిని ఖచ్చితంగా తినండి..

గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తగినంత రక్త ప్రవాహం లేకపోవడం వల్ల గుండె కండరాలు బలహీనంగా మారుతాయి. అలాగే గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒకప్పుడు గుండె జబ్బులు పెద్దవయసు వారికే వచ్చేవి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. 

28
heart health

సాధారణంగా గుండెపోటు గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనుల్లో అడ్డంకి వల్ల వస్తుంది. అందుకే గుండెపోటు రావడానికి కారణమయ్యే ప్రమాద కారకాలేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం అనుసరిస్తున్న జీవనశైలి కూడా గుండె సంబంధిత వ్యాధులను కలిగిస్తుంది. 

38
heart attack

పేలవమైన ఆహారం నుంచి ధూమపానం, మద్యపానం వరకు ఎన్నో కారకాలు హృదయ సంబంధ సమస్యలను కలిగిస్తాయి. ధూమపానం, మద్యపానం, నిశ్చల జీవనశైలి, ఒత్తిడి, పేలవమైన ఆహారం వంటి జీవనశైలి కారకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

48
Heart Attack

గుండె జబ్బుల మరొక లక్షణం గుండె కండరాలకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల కలిగే ఒక రకమైన ఛాతీ నొప్పి. అయినప్పటికీ మన ఆహారంలో కొన్ని మార్పులు చేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. గుండె జబ్బుల రిస్క్ తగ్గాలంటే ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

58
pineapple

అనాస పండు

బలమైన ప్రోటీన్-జీర్ణ ఎంజైమ్ బ్రోమెలిన్ ను కలిగున్న పైనాపిల్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే గుణాలు గుండెపోటును నివారించడానికి సహాయపడతాయి. 
 

68

అవిసె గింజలు

అవిసె గింజలు రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి కూడా సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో సహాయపడుతుంది. రోజూ కొన్ని అవిసెగింజలను తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
 

 

78
Image: Getty Images

అల్లం

అల్లంలో కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలుంటాయి. ఇది గుండె జబ్బులతో పోరాడే సూపర్ ఫుడ్స్ లో ఒకటి. అల్లం మీ మొత్తం కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుందని 2014 అధ్యయనం చూపించింది. అంతేకాదు 2008 లోచేసిన ఒక అధ్యయనం కూడా.. అల్లం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతుందని చూపించింది.
 

88
lemon juice

నిమ్మరసం

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తప్రవాహాన్ని పెంచడానికి బాగా సహాయపడుతుంది. రోజూ నిమ్మరసం తాగడం వల్ల మీ శరీరంలోని ఎల్డిఎల్ లేదా "చెడు" కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. నిమ్మరసం అధిక సిట్రిక్ యాసిడ్ కంటెంట్ కారణంగా ఉత్తమ సహజ క్లెన్సర్లలో ఒకటి.

click me!

Recommended Stories