ప్లాస్టిక్స్ ప్లేట్స్ లో తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Mar 24, 2024, 3:43 PM IST

స్టీల్ ప్లేట్స్ తో పాటుగా ప్లాస్టిక్ ప్లేట్లలో కూడా తింటుంటారు. అంతేకాదు స్కూల్, కాలేజీ పిల్లలు అందులోనే అన్నాన్ని తీసుకెళ్తుంటారు. కానీ ప్లాస్టిక్ పాత్రల్లో తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 
 

స్టీల్ ప్లేట్ కంటే ప్లాస్టిక్ పాత్రలే రకరకాల డిజైన్లు, రంగుల్లో ఉంటాయి. ఇవి కళ్లకు బాగా నచ్చుతాయి. అందుకే చాలా మంది వీటిని కొని వీటిలోనే తింటుంటారు. కానీ ప్లాస్టిక్ పాత్రల్లో తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అసలు ప్లాస్టిక్ పాత్రల్లో తినడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బలహీనమైన రోగనిరోధక శక్తి 

ప్లాస్టిక్ పాత్రల్లో ఎక్కువ సేపు ఉన్న ఆహారాలను తింటే మన రోగనిరోధక శక్తిపై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల మీరు లేని పోని రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను తగ్గించే ఎన్నో వ్యాధులొచ్చేలా చేస్తుంది. 

హార్మోన్ల అసమతుల్యత 

హార్మోన్లన్నీ సక్రమంగా ఉన్నప్పుడే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. కానీ ప్లాస్టిక్ పాత్రల తయారీలో బీపీఏ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది మన శరీరంలో ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను అసమతుల్యంగా చేస్తుంది. దీనివల్ల ఎన్నో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

మూడ్ స్వింగ్స్

ప్లాస్టిక్ ప్లేట్స్ లో తింటే మూడ్ స్వింగ్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రతిరోజూ ప్లాస్టిక్ ప్లేట్స్ లో తింటే మీ శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ అసమతుల్యంగా మారుతుంది. ఇది మీ మానసిక స్థితిలో మార్పునకు దారితీస్తుంది.
 


జిడ్డు చర్మం 

ప్లాస్టిక్ పాత్రల్లో ఫుడ్ ను తినడం వల్ల శరీరానికి, చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వీటిలో తినడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల మొటిమలు అయ్యే అవకాశం ఉంది. 
 

ఒత్తిడి

ప్లాస్టిక్ పాత్రల్లో అన్నం తింటే ఒత్తిడి బాగా పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ పాత్రల్లో పొరపాటున కూడా తినకూడదు. ఇలా తింటే మీలో ఒత్తిడికి సంబంధించిన సమస్యలు వస్తాయి. 

eating food

సరిగా నిద్ర పట్టకపోవడం.

ఎక్కువ సేపు ప్లాస్టిక్ పాత్రల్లో ఫుడ్ ను తినడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే మీరు సరిగ్గా నిద్రపోలేరు. దీంట్లో తినడం వల్ల మీకు అసలు పడుకున్నట్టుగా కూడా ఉండదు. 

గుండెపై చెడు ప్రభావాలు

ప్లాస్టిక్ లో ఎన్నో రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.  ప్లాస్టిక్ పాత్రల్లో చాలా కాలంగా తింటుంటే మీ గుండె ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. 
 

click me!