ఐరన్ ఎక్కువగా ఉండే కూరగాయలు
ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే పాలకూర పకోడీలు వంటి కూరగాయలను టీతో కలిపి తినడం వల్ల శరీరంలో ఇనుము శోషణ పరిమితం అవుతుంది. టీలో ఉండే టానిన్లు, ఆక్సిలైట్ సమ్మేళనాలు శరీరంలో ఇనుము శోషణను నిరోధిస్తాయి. బ్లాక్ టీలో టానిన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది గ్రీన్ టీలో కూడా ఉంటుంది. ఇనుము ఎక్కువగా ఉండే కూరగాయలు, ధాన్యాలు, కాయలు, బీన్స్ వంటి ఇతర ఆహారాలను కూడా టీతో ఎప్పుడూ తీసుకోవద్దు.