సమతుల్య ఆహారం
సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం ఒత్తిడిని తగ్గించడానికి, రాత్రిళ్లు హాయిగా పడుకోవడానికి సహాయపడుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించండి. లేదా రాత్రిళ్లు మొత్తమే తినకండి. ఆల్కహాల్ వినియోగాన్ని కూడా పరిమితం చేయండి. వీలైనంత ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ప్రోటీన్లను తినండి. ఇవి మీరు ఆరోగ్యంగా ఉండటానికి, రాత్రిళ్లు ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడతాయి.