
సాధారణంగా వచ్చే టాప్ 5 క్యాన్సర్లలో కిడ్నీ క్యాన్సర్ ఒకటి. ఏటా ఈ కిడ్నీ క్యాన్సర్ 20.1 లక్షల మంది ప్రాణాలను బలిగొంటోంది. అందులోనూ ఈ వ్యాధి పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా వస్తుంది. కానీ ఈ వ్యాధి మగ, ఆడ ఇద్దరికీ వచ్చే రిస్క్ ఉంది. నివేదికల ప్రకారం.. ప్రతి ఏడాది 3,30,000 కంటే ఎక్కువ కొత్త మూత్రపిండాల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని సకాలంలో గుర్తించకపోవడం వల్ల చికిత్స తీసుకుంటూ చాలా మంది చనిపోతున్నారు. దీనిపై జనాలకు అవగాహన లేకపోవడం, అపోహలను నమ్మడం వంటివే ప్రాణాల మీదికి తెస్తున్నాయి. అసలు మూత్రపిండాల క్యాన్సర్ గురించి ఎలాంటి విషయాలను నమ్మకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
అపోహ1: మూత్రపిండాల క్యాన్సర్ చాలా అరుదు
దీన్ని అస్సలు నమ్మకూడదు. చాలా మంది మూత్రపిండాల వ్యాధి ఎక్కువగా రాదని నమ్ముతుంటారు. నిజమేంటంటే..మూత్రపిండాల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 లక్షల మందిని చంపుతోంది. ఈ వ్యాధి పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ వస్తుంది. కానీ మహిళలకే ఇది ఎక్కువగా వస్తోంది.
అపోహ 2: స్మోకింగ్ వల్ల మూత్రపిండాల క్యాన్సర్ రాదు
స్మోకింగ్ మూత్రపిండాలకు సంబంధించినది కాదని చాలా మంది నమ్ముతుంటారు. వాస్తవంగా చెప్పాలంటే ధూమపానం మూత్రపిండాల క్యాన్సర్ కు అతిపెద్ద ప్రమాద కారకాలలో ఒకటి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. స్మోకింగ్ మూత్రపిండ కణ క్యాన్సర్ ప్రమాదాన్నిచాలా పెంచుతుంది. ఇది క్యాన్సర్ అత్యంత సాధారణ రూపాలలో ఒకటి.
అపోహ3 : మూత్రపిండాల క్యాన్సర్ శస్త్రచికిత్స మూత్రపిండాలను తొలగిస్తుంది
మూత్రపిండాల్లోనైనా, ఊపిరితిత్తుల్లోనైనా, మరెక్కడైనా ఏ రకమైన క్యాన్సర్ వచ్చినా ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయొచ్చు. క్యాన్సర్ పెరుగుదల స్వభావాన్ని బట్టి శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఈ శస్త్రచికిత్స క్యాన్సర్ కణితిని మాత్రమే తొలగిస్తుంది. అంతేకానీ మూత్రపిండాలను తొలగించదు.
అపోహ4 : కిడ్నీ క్యాన్సర్ వంశపారంపర్యం కాదు
చాలా మంది తమ కుటుంబంలో ఇది ఎవరికీ లేకపోతే మాకు కూడా మూత్రపిండాల క్యాన్సర్ రాదని భావిస్తుంటారు. కానీ మూత్రపిండాల క్యాన్సర్ కేసులలో 2-3% వంశపారంపర్యంగా ఉన్నాయని వైద్య డేటా చెబుతోంది. ఈ సంఖ్య తక్కువగా కనిపించినప్పటికీ.. మీకు ఈ రకమైన క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉంటే ప్రమాద కారకాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
మూత్రపిండాల క్యాన్సర్ లక్షణాలు?
ప్రారంభ దశలో మూత్రపిండాల క్యాన్సర్ ఎలాంటి లక్షణాలను చూపించదు. కానీ కొన్ని సంకేతాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. పార్శ్వంలో నొప్పి ముఖ్యంగా ఒక వైపు మూత్రమే. మూత్రం రంగులో మార్పు. కొన్నిసార్లు మూత్రంలో రక్తం కనిపించడం. తీవ్రమైన జ్వరం, చాలా బరువు తగ్గడం, చెమట, అలసట వంటి లక్షణాలు కొంతమంది కిడ్నీ క్యాన్సర్ పేషెంట్లలో కనిపిస్తాయి. ఇది ఇతర అవయవాలకు వ్యాపించినప్పుడు అంటే రెండో దశలో స్పష్టమైన లక్షణాలను చూడొచ్చు. దీనిలో ఎముక నొప్పులు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. మీకు మీరు ఇది మూత్రపిండాల క్యాన్సర్ అని నిర్ధారించుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవి ఇతర సమస్యల వల్ల కూడా వస్తాయి. ఏదేమైనా హాస్పటల్ లో చెక్ చేయించుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.