మెంతి వాటర్ చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మెంతికూరలో డయోస్జెనిన్ అనే సమ్మేళనం ఉంటుంది.ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జుట్టు బాగా పెరిగేందుకు, చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. మెంతి నీటిని పరగడుపున తాగడం వల్ల ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందొచ్చు.