వర్షాకాలంలో గుడ్లను తింటే..!

Published : Jul 10, 2023, 01:15 PM IST

గుడ్లు సంపూర్ణ ఆహారం. వీటిని తింటే మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. అంతేకాదు గుడ్ల మన శరీరాన్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి తెలుసా?   

PREV
16
వర్షాకాలంలో గుడ్లను తింటే..!
Image: Freepik

వర్షాకాలంలో లేని పోని రోగాలు వస్తుంటాయి. ఎందుకంటే ఈ సీజన్ లో మన ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఇదే ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలకు  దారితీస్తుంది. అయితే కొన్ని ఆహారాలు మన రోగనిరోధక శక్తిని పెంచి మనల్ని ఎన్నో రోగాకలు దూరంగా ఉంచుతాయి. ఇలాంటి ఆహారాల్లో గుడ్లు ఒకటి. నిజానికి గుడ్లు మంచి పోషక నిధి. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర బలాన్ని పెంచుతాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలాంటి వాటిని వానాకాలంలో తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26
Image: Getty

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

గుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలతో పాటుగా జింక్, సెలీనియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడతాయి. అలాగే వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే దగ్గు, జలుబు వంటి సాధారణ అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించడానికి సహాయపడతాయి.
 

36

 ప్రోటీన్ పవర్ హౌస్

గుడ్లు నాణ్యత గల ప్రోటీన్ కు అద్భుతమైన మూలం. మన శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కండరాల మరమ్మత్తు, పెరుగుదల మెరుగ్గా ఉంటుంది. ఇది కడుపును నిండుగా ఉంచుతుంది. సంతృప్తిని పెంచుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. 

46

పోషక సాంద్రత

గుడ్లు మంచి పోషకాహారం. వీటిలో కేలరీల కంటెంట్ కు సంబంధించి విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. శక్తి ఉత్పత్తికి, మెదడు పనితీరుకు, ఎర్ర రక్త కణాల నిర్మాణానికి అవసరమైన బి 12, ఫోలేట్ తో సహా బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.
 

56

కంటి ఆరోగ్యం

గుడ్లలో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఈ సమ్మేళనాలు వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత నుంచి రక్షించడానికి సహాయపడతాయి. ఇదొక సాధారణ కంటి సమస్య. వర్షాకాలంలో గుడ్లను తినడం వల్ల కంటిచూపు మెరుగ్గా ఉంటుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

66
egg

సెరోటోనిన్ ఉత్పత్తి

గుడ్లు ట్రిప్టోఫాన్ కు సహజ మూలం. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడే అమైనో ఆమ్లం. దీనిని తరచుగా "ఫీల్-గుడ్" హార్మోన్ అని పిలుస్తారు. ఇది మనల్ని ఆనందంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. 

click me!

Recommended Stories