ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదు. పూర్తి ఆరోగ్యం వేల కోట్లతో సమానం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇది అందరికీ అవగాహనలోకి వచ్చిన విషయం.
అయితే కరోనా బారిన పడి కోలుకున్నవారు కరోనాతో కొట్టుమిట్టాడుతున్నవారికి ప్లాస్మాదానం చేయడం వల్ల మరో ప్రాణాన్ని కాపాడుతున్నారు. ఇలా ప్లాస్మాదానం చేస్తున్న వారు చాలామందే ఉన్నారు.
కరోనాతో పోరాడడమే కాకుండా.. ప్లాస్మా దానం కూడా చేసినట్టైతే ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకుంటే తిరిగి పూర్తి ఆరోగ్యంగా మారిపోతారు. అవేంటో ఇప్పుడు చూడండి..
కోడిగుడ్లు : వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి 2 లేదా రిబోఫ్లేవిన్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఇతర కణాల పనితీరును మెరుగుపరుస్తుంది.
వాటి పెరుగుదలకు సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లను శరీరానికి అవసరమయ్యే శక్తిగా మార్చడం ద్వారా అలసటను తరిమి కొట్టడంతో సాయపడుతుంది. విటమిన్ బి 2 ఎక్కువగా లభించే ఆహారపదార్థాలు ఆకుపచ్చ కూరగాయలు, మాంసం, నట్స్, గుడ్లు, పాలు, పెరుగు.

నట్స్ : నట్స్ లోని ఐరన్ కంటెంట్ కణజాలాలకు ఆక్సీజన్ ను రవాణా చేయడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాదు శరీరానికి కావాల్సిన బలాన్ని, శక్తిని అందించడంతో బాగా పనిచేస్తుంది.
ప్లాస్మా దానం తరువాత, శరీరంలోని ఐరన్ శాతం తగ్గుతుంది. దీనివల్ల తరచుగా అలసట, బలహీనతఅనిపిస్తుంది. దీనినుండి బయటపడడానికి బీన్స్, తృణధాన్యాలు, మాంసం, నట్స్, చేపలు లాంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.
ఆస్పరాగస్ : శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో తోడ్పడే ఫోలేట్ మరో రూపం ఫోలిక్ ఆమ్లం. ఆస్పరాగస్ లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఆ ఫోలిక్ ఆమ్లమే ఎర్రరక్త కణాల ఉత్పత్తికి సాయపడుతుంది.
అందుకే ప్లాస్మా దానం సమయంలో కోల్పోయిన రక్త కణాలను భర్తీ చేయడానికి కూడా ఫోలేట్ సహాయపడుతుంది. శరీరంలో ఫోలేట్ కంటెంట్ పెంచడానికి సులభమైన వనరులు ఆస్పరాగస్, ఆకుకూరలు, నారింజ రసం.
అందుకే ప్లాస్మా దానం సమయంలో కోల్పోయిన రక్త కణాలను భర్తీ చేయడానికి కూడా ఫోలేట్ సహాయపడుతుంది. శరీరంలో ఫోలేట్ కంటెంట్ పెంచడానికి సులభమైన వనరులు ఆస్పరాగస్, ఆకుకూరలు, నారింజ రసం.
తాజా పళ్ల రసాలు : ప్లాస్మా దానం తర్వాత శరీరం హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. దీనికోసం తాజా బత్తాయి రసం ఎంతో ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే సహజ చక్కెర శరీరానికి ఇంధనంల పనిచేస్తుంది.
అలాగే, ప్లాస్మాను రీహైడ్రేట్ చేయడానికి, రక్తపోటును తగ్గించకుండా ఉండటానికి ప్లాస్మా దానం చేసిన తర్వాత 24-48 గంటలు నీరు బాగా తాగాలి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం.