ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరు గుండె జబ్బుల బారినపడుతున్నారు. హార్ట్ ఎటాక్ ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి. చిన్న పిల్లలు, యువకులు సైతం నిలబడిన చోటే కుప్పకూలే పరిస్థుతులను తరచూ మనం చూస్తున్నాం. అలాంటి ముప్పు నుంచి కొంత వరకైనా తప్పించుకోవాలంటే రోజూ ఈ నియమాలు పాటించాల్సిందే.
హార్ట్ ఎటాక్ చిన్న వయసు నుంచి ముసలివాళ్ల వరకు ఎవరిని విడిచిపెట్టడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.8 కోట్ల మంది హార్ట్ ఎటాక్ బారినపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వెంటనే చికిత్స తీసుకుంటే బతికే అవకాశమున్నా.. ఛాతి నొప్పి అని చాలా మంది తేలికగా తీసుకోవడం వల్ల చనిపోతున్నారు. అయితే రోజూ కొన్ని నియమాలు పాటించడం ద్వారా హార్ట్ ఎటాక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
28
బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గుండెకు మరింత మేలు చేస్తాయి. ఉదయం ఉత్సాహంగా నిద్ర లేవడమే కాదు.. మంచి బ్రేక్ ఫాస్ట్ చేయడం కూడా ముఖ్యమే. పొద్దున్నే మంచి ఫుడ్ తీసుకునే వారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించి.. పండ్లు, పాలు, గుడ్లు, బాదం వంటివి తీసుకోవాలి.
38
వ్యాయామం చేయండి
నిద్ర లేవగానే కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. కాళ్ళని బాగా చాచి, మడిచి, శరీరాన్ని బాగా కదిలించడం వంటి
సాధారణ వ్యాయామాలు రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి, రక్తపోటుని తగ్గిస్తాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
48
ఇవి తగ్గించండి
ఉదయాన్నే చాలా మంది కాఫీ, టీ లాంటి పానీయాలతో రోజుని ప్రారంభిస్తారు. ఉదయాన్నే ఎక్కువ చక్కెర తీసుకోవడం రక్తపోటుకి దారితీస్తుంది. హార్ట్ ఎటాక్ కి కూడా కారణం అవుతుంది. చక్కెర బరువు పెరిగేలా చేస్తుంది. ఎక్కువ ఉప్పు కూడా రక్తపోటుని పెంచుతుంది. కాబట్టి ఉప్పు, చక్కెర తగ్గించడం మంచిది.
58
నీళ్ళు తాగడం ముఖ్యం
శరీరానికి నీళ్ళు చాలా ముఖ్యం. రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగాలి. ఇది ఆరోగ్యానికి, చర్మానికి మంచిది. కొంతమంది నీళ్ళకి బదులు సోడా, కూల్ డ్రింక్స్ తాగుతారు. ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది. నీళ్ళు తాగలేని వాళ్ళు తక్కువ ఉప్పుతో మజ్జిగ, నిమ్మరసం, చక్కెర లేకుండా పండ్ల రసం తాగడం మంచిది.
68
మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి
హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువ ఒత్తిడి ఉంటే రక్తపోటు పెరుగుతుంది. ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజుకి 10 నిమిషాల ధ్యానం మంచిది.
78
బాగా నవ్వండి
నవ్వు హృదయానికి ప్రశాంతత ఇస్తుంది. ఒత్తిడి హార్మోన్లని తగ్గిస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజూ నవ్వడానికి సమయం కేటాయించండి. ఫన్నీ వీడియోలు చూడండి. ఫ్రెండ్స్ తో జోక్స్ చెప్పుకోండి. ఇది ఒత్తిడిని తగ్గించి గుండెను పదిలింగా ఉంచుతుంది.
88
చిన్న నడక
ఎక్కువసేపు కూర్చోవడం హార్ట్ కి అంత మంచిది కాదు. రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. రక్తపోటు, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ప్రతి గంటకూ లేచి కాళ్ళు చాచడం, నడవడం అలవాటు చేసుకోవాలి.