Dhanush :ధనుష్ - ఐశ్వర్య విడాకులు, కారణం ఇదేనా? రజనీ రెస్పాన్స్ ఏంటి?

First Published | Jan 18, 2022, 11:04 AM IST

తమిళ  స్టార్ హీరో ధనుష్ అభిమానులకు, సినిమా ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
 


సినీ పరిశ్రమలో వరుసగా డైవర్స్ కేసులు వస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య,సమంత విడాకుల విషయం ఇంకా చర్చలో ఉండగానే ఈసారి తమిళ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ ఊహించని ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. స్టార్ హీరోగా తనదైన శైలిలో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకు విడాకులు ప్రకటించారు. ఈ విషయాన్ని వారిద్దరూ తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించారు. ఈ నేఫధ్యంలో అసలు వీరెందుకు విడిపోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. తమిళ మీడియా ప్రత్యేక కథనాలు వెలువరిస్తోంది.

Image: Getty Images


సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వీరు విడిపోతున్నట్లు ప్రకటించడంతో ఈ వ్యవహారం వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆయన ప్రకటించిన కొద్దిసేపటికే ఐశ్వర్య కూడా తాము విడిపోతున్న విషయాన్ని ఖరారు చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు.



ధనుష్ కస్తూరిరాజా కుమారుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కి విడుదలైన 'కాదల్ కొండెన్' అనే సినిమా కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ధనుష్, ఐశ్వర్య మధ్య పరిచయం ఏర్పడింది. నెమ్మదిగా ఆ పరిచయమే వీరి ప్రేమకు దారి తీసింది. దీంతో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే వరకు వెళ్లింది.

‘నా రెండో సినిమా కాదల్‌ కొండై సినిమా చూసిన ఐశ్వర్య.. నా యాక్టింగ్‌ బాగుందని ప్రశంసించింది. ఇంటికి బొకే పంపించి టచ్‌లో ఉండమని చెప్పింది. ఆ పదం మా ఇద్దరిని మరింత దగ్గరకు చేసింది. మేము స్నేహితులుగా ఉన్న సమయంలోనే మేము ప్రేమలో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత ఒకరినొకరం ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులకు తెలిపి.. వారి అంగీకారంతోనే వివాహం చేసుకున్నాం’ అని గతంలో ఓ ఇంటర్యూలో ధనుష్‌ చెప్పారు.


2004, నవంబరు 18న వీరిద్దరి వివాహం  జరిగింది. అప్పుడు ధనుష్ వయసు కేవలం 21 మాత్రమే. ధనుష్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. ఆ తర్వాత చాలా అన్యోన్యంగా ఉంటూ వచ్చారు.వీరి ప్రేమకు గుర్తుగా యాత్ర రాజా, లింగ రాజా అనే ఇద్దరు మగ పిల్లలు కూడా జన్మించారు. వారిలో యాత్ర రాజా వయసు 15 సంవత్సరాలు కాగా లింగ రాజా వయసు 11 సంవత్సరాలు.

 
ఇక ఫ్యాన్స్ చాలా మంది ఈ విడాకుల నేపధ్యంలో రజనీకాంత్ విషయమై చర్చిస్తున్నారు. ఎల్లప్పుడు పాజిటివిటీతో ఉండే ఆయన ఎలా స్పందిస్తారని ఎదురుచూస్తున్నారు. ఆయన పర్శనల్ లైఫ్ లో ఇది ఊహించని పరిణామం అంటున్నారు. దేవుడు ఆయన్ని ఎందుకు శిక్షిస్తున్నాడో అని వాపోతున్నారు. తలైవా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటిదాకా రజనీ ఈ విషయమై స్పందించలేదు.

గతంలో ఐశ్వర్య ఇచ్చిన ఓ ఇంటర్వూలో  తమ రిలేషన్ గురించి మాట్లాడుతూ.., “మేమిద్దరం ఒకరికొకరం తగినంత స్పేస్ ఇచ్చుకుంటాము. కలిసి ఉండటం కోసం మేము ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకోవటం వంటివి నమ్మము .” అని చెప్పుకొచ్చింది. అందులో ఎవరి జీవితం వారిదన్న భావన కనిపిస్తోందని ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి.

ఇదిలా ఉండగా వీరి విడాకులకు బీజం అప్పట్లో ధనుష్‌ పై గాయని సుచిత్రా కార్తీక్  చేసిన ట్వీట్లుతోనే పడిందంటున్నారు. ఆ ట్వీట్స్ బాగా  దుమారం రేపాయి.సుచిలీక్స్.. కోలీవుడ్‌లో వివాదాస్పదమైన టాపిక్. ధనుష్, హన్సిక, త్రిష వంటి టాప్ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను అలానే కొందరి హీరోయిన్ల నగ్న ఫోటోలను బయటపెట్టి పెద్ద దుమారానికి తెరలేపింది.

అప్పట్లో సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ నుంచి మరో వీడియో బయటపడింది. హీరో ధనుష్ తమన్నా, పూనమ్ భజ్వా(మొదటి సినిమా, బాస్ ఫేం)లతో కలిసి మద్యం తాగుతూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో కూడా సుచిత్ర కార్తిక్ ట్విట్టర్ అకౌంట్ నుంచే లీకైంది. అయితే, ఆ లీకులకు, తనకు ఎటువంటి సమాధానం లేదని ఆమె చెప్పింది. వాటి ప్రభావం కూడా ఈ విడాకులకు ఓ కారణం అంటూ తమిళ మీడియా అంటోంది.

మరో ప్రక్క ధనుష్ విడాకుల వార్తకు నాగచైతన్య విడాకులే స్పూర్తి అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. చాలా కాలంగా వీళ్లిద్దరూ విడిపోవాలనుకుంటున్నారని,ప్రపంచం కోసం కలిసి ఉంటున్నారని తమిళ మీడియా అంటోంది. అయితే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని, ప్రశాంతంగా ఏ గొడవా,గోల లేకుండా విడిపోవటం ఈ జంటకు స్పూర్తి ఇచ్చిందంటున్నారు.

 ఫ్యామిలీలలో చాలా సార్లు కౌన్సిలింగ్ లు జరిగాయని, ఇంట్లో వాళ్లకు ఇది పెద్ద వార్త కాదని, ఏదో రోజు ఇలా విడిపోయే వార్త వినాల్సి వస్తుందని ఊహించే ఉన్నారట. అందులో నిజమెంతో కానీ ఇలా చైతూ డైవర్స్ కు, ధనుష్ విడాకులకు ముడిపెట్టడం మాత్రం పద్దతి కాదంటున్నారు.


సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్  తో విడాకులు ప్రకటించగానే, ఇక్కడ మెగాస్టార్ ఇంట్లో కూడా ఆందోళన  మొదలైoది! రజనీ లేదా ధనుష్ తో ఏ సంబంధం లేదు కానీ, చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ కు ఐశ్వర్య నిర్ణయం తో ధైర్యం వచ్చింది!  ఐశ్వర్య లా ట్వీట్ చేయలేదు కానీ, పేస్ బుక్, ఇస్టాగ్రమ్ లో తన పేరు పక్కన ఉండే భర్త కళ్యాణ్ పేరును తొలగించి, తన పుట్టింటి పేరు కొణిదెల తగిలించుకుంది! ఇంట్లో మాత్రం ప్రకటించేసింది! పరువు ప్రతిష్ట అంటూ పాకులాడే  చిరంజీవి కొన్నాళ్ళు వేచి ఉండమని  చెప్పినా భర్త కళ్యాణ్ కు గుడ్ బై చెప్పి కుమార్తె తో కలసి శ్రీజ పుట్టింటికి వచ్చేసినట్లు విశ్వసనీయ సమాచారం!


"18 ఏళ్ల పాటు స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరికొకరు కలిసిమెలిసి ప్రయాణం సాగించాం, మా ప్రయాణం ఎదుగుదల, అవగాహన, సర్దుబాటు, అనుకూలతలతో సాగింది.. ఈరోజు దారులు వేరవుతున్నట్టు ఐశ్వర్యకు నాకు అనిపిస్తోంది. జంటగా విడిపోయి, మమ్మల్ని అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి అని నిర్ణయించుకున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి మరియు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రైవసీ మాకు అందించండి. ఓం నమశివాయ! అంటూ ధనుష్ పేర్కొన్నారు. దాదాపు ఇదే సందేశాన్ని ఐశ్వర్య కూడా చివరిలో తన పేరుతో పంచుకున్నారు. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య కూడా మొదటి భర్తకు విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకున్నారు.

Latest Videos

click me!