Shyam Singha Roy:స్టోరీ లైన్ లీక్, 'చంద్రముఖి' టైప్ స్క్రీన్ ప్లే ? పునర్జన్మ కాదు

Surya Prakash   | Asianet News
Published : Dec 21, 2021, 07:26 AM IST

నాని తన కెరియర్లోనే డిఫరెంట్ లుక్ ను ట్రై చేసిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. 70వ దశకంలో కలకత్తాలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. బెంగాలి చీరకట్టులో సాయిపల్లవి కనిపించనుండటం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ.  

PREV
115
Shyam Singha Roy:స్టోరీ లైన్ లీక్, 'చంద్రముఖి' టైప్ స్క్రీన్ ప్లే ? పునర్జన్మ కాదు
Shyam Singha Roy

 
ఇప్పటికే ట్రైలర్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథపై రకరకాల కథనాలు మీడియాలో వస్తున్నాయి. పునర్జన్మ చుట్టూ తిరిగే కథ అని అంటున్నారు. అయితే అది నిజం కాదని తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో సర్కులేట్ అవుతున్న కథనం ప్రకారం ఈ సినిమా స్టోరీ లైన్ చంద్రముఖిని గుర్తు చేస్తుంది.  ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాక్సీ వాలా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సంకృత్యాన్ దర్శకుడుగా వ్యవహరించారు.  ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ నేపధ్యంలో లీక్ అయ్యిందంటూ ప్రచారంలో ఉన్న కథ మీకు అందిస్తున్నాం...ఈ కథలో నిజమెంత అనేది రిలీజ్ అయితేనే కానీ తెలియదు. కాబట్టి సరదాగా ఓ లుక్కేయండి.

215
Shyam Singha Roy Teaser

వాసు(నాని) సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి డైరక్టర్ అవ్వాలనుకుంటాడు. తనను తాను ఓ న్యూ ఏజ్  ఫిల్మ్ మేకర్ గా భావించి  షార్ట్ ఫిల్మ్ లు చేస్తూంటాడు. ఆ క్రమంలో తను సినిమా చేయటం కోసం కథ అన్వేషిస్తూంటాడు. ఆ క్రమంలో  వాసు(నాని) కు ఓ కథ ఆలోచన వస్తుంది. ఓ పీరియడ్  సినిమా చెయ్యాలనుకుంటాడు. అలాగని ఏదో కల్పిత కథ చేయాలనుకోడు. రియలిస్టిక్ కథ తో తన కెరీర్ మొదలెట్టాలనుకుంటాడు.

315

ఆ కథ కోసం రీసెర్చ్ చేస్తూంటాడు. అందులో భాగంగానే కోలకత్ వెళతాడు. అక్కడ అప్పటి పరిస్దితుల గురించి రీసెర్చ్ చేస్తుూంటాడు. ఆ క్రమంలో 1969-70 లలో నివరసించిన  శ్యామ్ సింగరాయ్ గురించి తెలుస్తుంది. అతనో కమ్యూనిష్య్ రైటర్.,జర్నలిస్ట్. రాజారామ్ మోహన్ రాయ్ తరహా సోషల్ రిఫార్మర్ అని అర్దమవుతుంది. రవీంద్రనాధ్ ఠాగూర్ లాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. ఈ రీసెర్చ్ సమయంలో అనుకోనిది ఒకటి జరుగుతుంది. అదేమిటంటే..
 

415


 
నాని చేసిన వాసు పాత్రకు ఓ చిత్రమైన సైక్లాజికల్ సమస్య ఉంటుంది. తను తీస్తున్న లేదా రాస్తున్న లో ఉన్న పాత్రల లో తనని తాను ఊహించుకుంటూ ఉంటూంటాడు. దాంతో సినిమా కథ మొత్తం నాని కి ఉన్న ఈ అలవాటు చుట్టూ తిరుగుతుంది. తాను ఏదైనా ఇష్టపడతాడో ఆ పాత్రలోకి పూర్తిగా లీనమై పోతాడు. అలా నాని పాయింటాఫ్ వ్యూలో బెంగాళ్ లో జరిగే కథ ఆవిష్కారం అవుతుంది.

515

తనే అప్పటి శ్యామ్ సింగరాయ్ అనుకుని ఈ కాలంలోనూ ప్రవర్తిస్తూంటాడు. ఇది అతనికి కూడా తెలియకుండా జరిగిపోతుంది. దాంతో అప్పటి పరిస్దితులని ఆవాహన చేసుకున్నట్లుగా చెలరేగిపోతూంటాడు. ఫిల్మ్ మేకరు ఇలా చేయటం ఏమిటని ఆశ్చర్యపోతూంటారు. ఈ క్రమంలో శ్యామ్ సింగరాయ్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది.

615
Shyam Singha Roy


శ్యామ్ సింగరాయ్ సినిమా బెంగాల్ నేపథ్యంలో సాగే కథ కాగా ఒకప్పుడు కలకత్తాలో ఎక్కువగా ఉండే దేవదాసి వ్యవస్థ, దాని చుట్టూ అల్లుకున్న పరిస్థితులను ఎదురించే హీరో పోరాటంగా ఈ సినిమా సాగనుంది. ఇందులో సాయిపల్లవి దేవదాసిగా కనిపిస్తుంది. కలకత్తాలో జరిగే దేవదాసి వ్యవస్థ ఆగడాలపై ఆ జర్నలిస్టు పాత్ర  పోరాడుతుంది. 

715
Shyam Singha Roy


ఇక అప్పటి శ్యామ్ సింగరాయ్ పాత్రలోకి తెలియకుండా సైక్లాజికల్ గా వెళ్లిపోయిన వాసు ...ఇప్పట్లోనూ ఉన్న అలాంటి సమస్యను డీల్ చేస్తాడు. అప్పటికు ఇప్పటికీ కాలం మారినా సమస్యలు మారలేదని అంటాడు. ఓ రకంగా చంద్రముఖి సినిమా గుర్తు వస్తుందంటున్నారు. రజనీ చంద్రముఖిలో..జ్యోతిక పాత్ర తనకు తెలియకుండానే చంద్రముఖిని ఎలా మనస్సులో నింపేసుకుని, చంద్రముఖిగా బిహేవ్ చేస్తుందో...అలాగే శ్యామ్ సింగరాయ్ పాత్రలోనూ నానిలీనమై అప్పటి వ్యక్తిలా బిహేవ్ చేస్తూంటాడు.

815
Shyam Singha Roy

స్క్రిన్ ప్లే ప్రకారం శ్యామ్ సింగరాయ్ వేరు, వాసు వేర్వేరు అన్నట్లు గా సాగుతుంది. శ్యామ్ సింగ రాయ్ పాత్రలోకి వెళ్లిపోయిన ఈ ఫిల్మ్ మేకర్ చిత్రంగా బిహేవ్ చేయటం, చివరకు అతనెవరు అనేది రివీల్ అవటం ఇంటర్వెల్ అని అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత శ్యామ్ సింగరాయ్ పూర్తి పాత్ర ప్లాష్ బ్యాక్ గా వస్తుందని, సెకండాఫ్ లో ఆ పాత్రలోంచి బయిటకు వచ్చిన నాని ఈ కాలంలో ఏం చేసాడు అనేది క్లైమాక్స్ అవుతుందని చెప్తున్నారు.

915
Shyam Singha Roy


ఇక ఈ సినిమా రెండు టైమ్ లైన్స్ మధ్య  ..human consciousnessని ఎక్సప్లోర్ చేస్తుంది.అలాగే రెండు కాలాల్లోనే భావోద్వేగాలను బాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఏ కాలంలో అయినా డైమన్షన్స్, హ్యూమన్ ఎమోషన్స్ ఒకేలా ఉంటాయని, టైమ్ అండ్ స్పేస్ మారినా పెద్ద మార్పేమీ ఉండదని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారట.  దేవ‌దాసి వ్య‌వ‌స్థ అనే పాయింట్ క‌థ ప్ర‌కారం ప‌శ్చిమ బెంగాల్ లో స్టార్ అయిన ఆంధ్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు ఇలా ప్యాన్ ఇండియా స్థాయిలో దానిని చ‌ర్చిస్తున్నారు. ఈ సినిమాలో దేవ‌దాసి వ్య‌వ‌స్థ అనేది మెయిన్ స‌బ్జెక్ట్ కాదు..క‌థ‌లో క్యారెక్ట‌ర్‌కి భాగంగా తీసుకున్న‌దే.. దానికి వ్య‌తిరేకంగా లీడ్ క్యారెక్ట‌ర్ పోరాడుతాడు.

1015
Shyam Singha Roy

ఈ మధ్యనే తన "టక్ జగదీష్" సినిమాతో పెద్ద డిజాస్టర్ ని అందుకున్న నాని ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "శ్యామ్ సింగరాయ్" పైనే పెట్టుకున్నాడు. నాని కరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనున ఈ సినిమాలో "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి, "ప్రేమమ్" ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ మరియు సాయి పల్లవి లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమా ట్రైలర్  ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

1115


 నేచురల్ స్టార్ నాని త్వరలోనే ‘శ్యామ్ సింగ రాయ్’గా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో నటించనుండగా.. నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్నారు. 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‏లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందించగా భారీస్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. రిలీజ్ టైమ్ దగ్గర పడుతూండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. 

 

1215
Shyam Singha Roy

ఈ కథ రెండు కాలాల మధ్య కొనసాగుతుంది. వాసు - శ్యామ్ సింగ రాయ్ అనే రెండు పాత్రలను నాని పోషించాడు. ఈ రెండు కాలాలకు సంబంధించిన కథకు స్క్రీన్ ప్లే ప్రాణంగా కనిపిస్తుంది. ఈ రెండు కాలాలకి సంబంధించిన లింక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని అంటున్నారు. అది గనుక సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమైతే సినిమా హిట్టేనని చెబుతున్నారు

1315
Shyam Singha Roy

ఈ సినిమాలో వాసు పాత్రకి కథానాయికగా కృతి శెట్టి కనిపించనుంది. ఇక మడోన్నా పాత్ర ఏమిటనేది సస్పెన్స్ గా ఉంచుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, సిరివెన్నెల రెండు పాటలు అందించారు. ఆ పాటలు ఇప్పుడు ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

1415
Shyam Singha Roy

  ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో నటించనుండగా.. నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్నారు. 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‏లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందించగా భారీస్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. రిలీజ్ టైమ్ దగ్గర పడుతూండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. 

1515
Shyam Singha Roy

 ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‏ను.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసం దాదాపు రూ. 40 కోట్లు చెల్లించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమా థియేటర్లలో విడుదలై.. ఆ తర్వాత ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో పది ఎకరాలలో ప్రత్యేక సెట్ రూపొందించారని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories