First Time Allu Arjun in a Dual Role?
Allu Arjun Next Movie: పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయబోతున్నారు, ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే విషయంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.
అంతేకాదు ఆ రెండు పాత్రలు కూడా వేటికవే డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తున్నాయి. అలాగే అందులో ఒకటి పూర్తి నెగిటివ్ రోల్ అని, పుష్ప2 లో పాత్రకు కంటిన్యుటిలా అనిపిస్తుందని చెప్తున్నారు.
నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చాలా విభిన్నంగా ఆ పాత్రను ప్లాన్ చేసారట. బాలీవుడ్ నుంచి వస్తున్న ఈ వార్తల వివరాల్లోకి వెళ్దాం.
First Time Allu Arjun in a Dual Role?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్‌లో క్యాంప్ చేసి, అట్లీ దర్శకత్వం వహించనున్న తన నెక్ట్స్ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులను నిశితంగా పరిశీలిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల ఉండకపోవచ్చు.
బడ్జెట్‌లతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేసే పనిలో అట్లీ టీమ్ బిజీగా ఉంది. అల్లు అర్జున్ పుట్టినరోజున ఏప్రిల్ 8న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
First Time Allu Arjun in a Dual Role?
ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ పాత్రలో నెగెటివ్ షేడ్స్‌తో కనిపించనున్నాడు. అయితే అల్లు అర్జున్ స్వయంగా మెయిన్ విలన్‌గా కనిపిస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది.
ఈ నెలాఖరులోగా నటుడు హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. సంగీతం, నేపథ్య సంగీతం అందించడానికి అనిరుధ్ ని తీసుకున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాతలు. షూటింగ్ ప్రారంభమయ్యే ముందు భారీ ఎనౌన్సమెంట్ ఇవ్వటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని, అల్లు అర్జున్, అట్లీ ఇద్దరూ ఈ చిత్రానికి భారీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తారని వార్తలు వస్తున్నాయి.