హను రాఘవపూడి కి ప్రభాస్ వార్నింగ్? సెట్‌లో ఏం జరిగింది?

Published : Mar 17, 2025, 09:39 AM IST

Prabhas : ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా సెట్‌లో దర్శకుడు  కి  ప్రభాస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారనే వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రం ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసే ఎన్నో విశేషాలతో కొత్తగా ఉంటుందని హను తెలిపారు.

PREV
14
 హను రాఘవపూడి కి ప్రభాస్ వార్నింగ్? సెట్‌లో ఏం జరిగింది?
Prabhas, give a sweet warning to Hanu Raghavapudi?


Prabhas : దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi), హీరో ప్రభాస్‌ (Prabhas) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.   ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సోషల్‌మీడియా స్టార్‌ ఇమాన్వీ ఎస్మాయిల్‌  హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ వైరల్ అవుతోంది. 

24
Prabhas, give a sweet warning to Hanu Raghavapudi?


మీడియా వర్గాల నుంచి అందుతున్న వార్తలు ప్రకారం ఈ చిత్రం దర్శకుడు హను రాఘవపూడి కి ప్రభాస్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. అదీ సెట్ లో కూల్ గా ఉండమని. హను రాఘవపూడి కొంచెం హడావిడిగా ఉండటం, అప్పుడప్పుడూ టెక్నీషియన్స్ పై కోప్పడటం, గొంతు పెద్దది చేసి మాట్లాడటం, అరవటం వంటి వాటితో  సెట్ లో చాలా టెన్షన్ గా ఉంటున్నారట.

అయితే అదంతా మంచి అవుట్ ఫుట్ కోసమే, ప్రభాస్ వంటి స్టార్ తో చేస్తున్నప్పుడు ఏ మాత్రం పొరపాటు జరగకూడదని తీసుకునే జాగ్రత్తలే. అయితే కూల్ గా తన పని తాను చేసుకుని పోయే ప్రభాస్ సెట్లో కూడా అలాంటి వాతావరణమే కోరుకుంటారు.

దాంతో హను రాఘవపూడిని పిలిచి కూర్చోపెట్టి, హడావిడి పడద్దుని, కూల్ గా ఉంటేనే మంచి అవుట్ ఫుట్ వస్తుందని చిన్న స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చారని చెప్పుకుంటున్నారు.
 

34
Prabhas, give a sweet warning to Hanu Raghavapudi?


ఇది ప్రక్కన పెడితే...ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రభాస్‌ కోసమే తాను ఈ కథ రాశానని అన్నారు. ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసే ఎన్నో విశేషాలు ఈ సినిమాలో ఉంటాయని తెలిపారు.

‘‘ఈ చిత్రం తప్పకుండా కొత్తగా ఉంటుంది. మీరు ఇంతవరకూ చూడని కథను చూపిస్తున్నాం. ప్రభాస్‌ ఉన్నారు కాబట్టి ఎన్ని అంచనాలను అయినా ఇది అందుకుంటుంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది.

. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో నా వద్ద సుమారు ఆరు కథలున్నాయి. ఇది మాత్రం ప్రత్యేకంగా ప్రభాస్‌ కోసమే రాశాను. నా వద్ద ఉన్న వాటిల్లోంచి ఎంచుకున్నది కాదు. ‘సీతారామం’ తర్వాత దీనిని రాయడానికే సుమారు ఏడాదికి పైగా సమయం పట్టింది. ప్రేక్షకులు తప్పకుండా సర్‌ప్రైజ్‌ ఫీలవుతారు’’ అని అన్నారు.

44
Prabhas, give a sweet warning to Hanu Raghavapudi?


పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. విభిన్నమైన కథ, భారీ బడ్జెట్‌తో సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ‘ఫౌజీ’ (Fauji) అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఇమాన్వీ విషయానికి వస్తే.. ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌గా ఆమె యువతకు సుపరిచితురాలు.

హిందీతో పాటు, తెలుగు, తమిళ పాటలకూ ఆమె వేసే స్టెప్‌లు ఎంతగానో అలరించాయి. సుమారు 8 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఇమాన్వీని కథానాయికగా ఎంచుకోవడంపై గతంలో హను రాఘవపూడి స్పందించారు.

‘‘ఇమాన్వీ అందం, ప్రతిభ కలిగిన అమ్మాయి. అందరిలాగానే నేనూ ఆమె డ్యాన్స్‌ వీడియోలు చూస్తుంటా. ఆమె మంచి భరతనాట్యం డ్యాన్సర్‌. కళ్లతోనే ఎన్నో హావభావాలను పలికిస్తుంటుంది. అందుకే ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నా’’ అని హను చెప్పారు. ఆడిషన్స్‌, స్క్రీన్‌ టెస్ట్‌ అనంతరమే ఆమెను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories