#Godfather:మూడు రాజధానిలపై చిరు సెటైర్లు, జగన్ ని టార్గెట్ చేస్తూ డైలాగులు ?

First Published Sep 24, 2022, 12:00 PM IST

దేశవ్యాప్తంగా ఏపీ మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వికేంద్రీకరణపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వైఖరిని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు.అయితే ఈ టాపిక్ సినిమాల్లోకి డైలాగులు రూపంలోకి రాబోతోందా


ఒకప్పుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో పొలిటికల్ సెటైర్ సినిమాలు వచ్చాయి. అప్పటి రాజకీయ పరిస్దితులను సినిమాలో ఎండగడుతూ సీన్స్ , డైలాగులు ఉండేవి. అవి చూసి నవ్వుకునేవారు, ఉడుక్కునేవారు తప్పించి అంతకు మించి ముందుకు వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్దితిలు వేరు. సోషల్ మీడియాలో ప్రతీదీ రాజకీయం అయ్యిపోతోంది. అలాంటిది ఓ సెలబ్రెటి కనుక ముఖ్యమంత్రులపైనా, రాష్ట్ర పరిస్దితులపైనా మాట్లాడితే ఇంకేమన్నా ఉందా...కానీ చిరు ఆ ధైర్యం చేయబోతున్నారని మీడియాలో వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ పూర్తైంది. సైన్సార్ టాక్ అంటూ మీడియాలో ఒకటి తిరుగుతోంది.
 


ఆ టాక్ ప్రకారం ఈ సినిమాలో చిరంజివి ...చెప్పే డైలాగులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాలను ఉద్దేశించి ఉండబోతున్నాయంటున్నారు. ఈ సినిమాలో మూడు రాజధానిలపై సెటైర్స్ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇది రాజకీయ ప్రధాన చిత్రం. మలయాళ 'లూసిఫర్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారట.

god father


అలాగే పూర్తిగాని రాజధాని, గవర్నమెంట్ కొన్ని ప్రభుత్వ ఆస్దులను అమ్మేయటం, తిరిగి పదవుల్లోకి రావటానికి దేనికైనా సిద్దపడటం వంటివి ప్రస్తావించబోతున్నారట. అయితే ఇవి సినిమా కథలో భాగంగా వచ్చినట్లు కనపడతాయిట. అయితే అవి ప్రస్తుత రాజకీయ పరిస్దితులను అద్దం పడతాయని చెప్తున్నారు.  వీటికి తోడు రాజకీయాల లోతు తెలియకుండా సినిమావాళ్లు కొందరు ...వీటిలోకి వచ్చి మాట్లాడటం తర్వాత ఇబ్బంది పడటం వంటివి కూడా చూపబోతున్నారట. అయితే ఇందులో నిజమెంత అనేది సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలియదు. 

Chiranjeevi


ఇవన్నీ నిజమే అయితే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఈ సినిమా బోయ్ కాట్ చేయమనే ప్రచారం జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. అలాగే మిగతా పార్టీలు వారు కూడా ఈ డైలాగులు ఉపయోగించి జగన్ ప్రభుత్వాన్ని విమర్శలు, వెటకారాలు చేస్తుందని చెప్పుకుంటున్నారు. 


ఇక మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన చిరు.. ప్రస్తుతం ఆయా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అయితే సినిమాల్లో మెగాస్టార్ గా రాణించిన చిరంజీవి. ఆ మధ్య రాజకీయాల వైపు అడుగు వేసిన విషయం తెలిసిందే.. ప్రజారాజ్యం పార్టీ స్థాప్పించి ఎన్నికల్లో పోటీ చేశారు. 


ఆ తర్వాత అనూహ్యంగా ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. సెంట్రల్ మినిస్టర్ గాను సేవలు అందించారు. ఆ తర్వాత చిరు రాజకీయాలకు దూరంగా ఉంటూ తిరిగి సినిమాలు చేస్తున్నారు. 9 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మెగాస్టార్ . ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

మెగాస్టార్ వాయిస్ క్లిప్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వాయిస్ క్లిప్ లో” నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు” అనే డైలాగ్ చెప్పారు మెగాస్టార్. దాంతో ఈ డైలాగ్ పై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మెగాస్టార్ మరోసారి రాజకీయాల్లోకి రానున్నారంటూ కొందరు అంటుంటే మరికొంత మంది మాత్రం మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ డైలాగ్ అయ్యి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ షేర్ చేసిన ఈ వాయిస్ క్లిప్ ఇటు ఇండస్ట్రీలో అటు రాజకీయవర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.


మరో ప్రక్క రీసెంట్ గా ఈ చిత్రం ప్రమోషన్స్ లో  చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పారు. సరిగ్గా చెప్పాలంటే గాడ్ ఫాదర్ ఒక నిశ్శబ్ద విస్ఫోటనం అని అభివర్ణించారు. హీరోయిన్లు లేరేంటి, పాటలు లేవేంటి? అనే ఆలోచనే రానివ్వని సబ్జెక్ట్ గాడ్ ఫాదర్ అని పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎంతో ప్రేమతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాడని, హ్యాట్సాఫ్ టు సల్మాన్ భాయ్... వుయ్ లవ్యూ అని కొనియాడారు. 
 


ఇందులో జర్నలిస్టు పాత్ర చేసేందుకు దర్శకుడు పూరీ జగన్నాథ్ మొదట అంగీకరించలేదని చిరంజీవి వెల్లడించారు. ఈ సినిమా చూసి తర్వాత పూరీలో సాధికారత ఉన్న నటుడు ఉన్నాడని మీరే ఆశ్చర్యపోతారు అని తెలిపారు.  ఈ సినిమాకు ఆరో ప్రాణమై, 100 శాతం కంటే ఇంకా ఎక్కువకు తీసుకెళ్లిన వ్యక్తి సంగీత దర్శకుడు తమన్ అని కితాబునిచ్చారు.  

click me!