మహేష్ నాన్‌-డిస్‌క్లోజ్‌ అగ్రిమెంట్‌ (NDA)సైన్ చేసారా?

Published : Jan 28, 2025, 09:22 AM IST

మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇందులో నటించే వాళ్ల గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకే ఎగ్రిమెంట్స్ అందరితో చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 

PREV
15
  మహేష్  నాన్‌-డిస్‌క్లోజ్‌ అగ్రిమెంట్‌ (NDA)సైన్ చేసారా?
ss Rajamouli SSMB29

ఇప్పుడు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ ఏమిటంటే...మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్ కూడా  నాన్‌-డిస్‌క్లోజ్‌ అగ్రిమెంట్‌ (NDA)సైన్ చేసారా? అనేదే.  మహేశ్‌బాబు  హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ కోసం ఈ ఎగ్రిమెంట్ చేసారని తెలుస్తోంది. ఇంతకీ నాన్‌-డిస్‌క్లోజ్‌ అగ్రిమెంట్‌ (NDA)ఏమిటి...ఎందుకు చేయాల్సి వచ్చింది

25
Rajamouli, mahesh babu, Priyanka chopra, SSMB29


 #SSMB29గా రాబోతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా చేస్తూంటే,  ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు.  సినిమా షూటింగ్‌ కూడా మొదలు పెట్టేసారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న తాజా చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా ఈ టెక్నాలిజీ యుగంలో  ఎలాంటి లీక్‌లు లేకుండా సినిమా చేయటం కష్టమైపోతోంది. ఈ విషయంలో రాజమౌళి, ఆయన టీమ్‌ ఎంతో జాగ్రత్త పడుతున్నారు. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇందులో నటించే వాళ్ల గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకే ఎగ్రిమెంట్స్ అందరితో చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 

35
ssmb 29


లీక్ ల  విషయంలో చిత్ర టీమ్ కి గట్టిగానే హెచ్చరికలు జారీచేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నటీనటులు,  టెక్నీషియన్స్ తో నాన్‌-డిస్‌క్లోజ్‌ అగ్రిమెంట్‌ (NDA) చేయించినట్లు ఆంగ్ల పత్రిక కథనాలు పేర్కొన్నాయి.  అంతేకాదు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కూడా సైన్ చేసారని తెలుస్తోంది. ఈ ఎగ్రిమెంట్  ప్రకారం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి విషయాన్ని బయటకు చెప్పడానికి వీల్లేదు.  ఇంటర్నేషనల్ స్దాయిలో  తీస్తున్న సినిమా కావడంతో ఆ మాత్రం జాగ్రత్తలు ఉండాల్సిందేనని రాజమౌళి, నిర్మాతలు చెప్పి ఒప్పిస్తున్నట్లు సమాచారం. 
 

45
Mahesh Babu, Priyanka Chopra, SSMB29


ఆ ఎగ్రిమెంట్ ప్రకారం దర్శక-నిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్‌ చేసినా, బయటకు చెప్పినా భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు హీరోతో సహా సెట్‌లో ఉన్న వారెవరూ ఫోన్‌లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారని తెలుస్తోంది.

మహేష్, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్ చేత కూడా ఎగ్రిమెంట్ చేయిస్తే మిగతా వాళ్లు ఎవరూ కూడా ఎందుకు చేయాలి అని అడగకుండా స్మూత్ గా ఎగ్రిమెంట్ చేస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారని వినిపిస్తోంది. అయితే అఫీషియల్ గా మాత్రం ఈ విషయాలు మాత్రం బయిటకు రాలేదు. కేవలం మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే.  చిత్ర టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. 

55


ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన సెట్‌లో ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం. మరో రెండు మూడు చోట్ల కూడా ప్రత్యేకంగా సెట్స్‌ను సిద్ధం చేస్తున్నారు. అలాగే  ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, బాలీవుడ్ నటుడు జాన్‌ అబ్రహాం పేరు ఇప్పుడు వినిపిస్తోంది. ప్రియాంక చోప్రాతో కలిసి ఆయన స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  

Read more Photos on
click me!

Recommended Stories