నాని సినిమా క్లైమాక్స్ లో బాలయ్య, దాదాపు ఓకే చెప్పేసినట్లే?

నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్ లో కనిపిస్తే ఆ కిక్కే వేరు అంటారు అభిమానులు. దాన్ని నిజం చేస్తూ బాలయ్య ఇప్పుడు నాని హీరోగా చేస్తున్న సినిమా   క్లైమాక్స్‌లో బాలకృష్ణ అతిధి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.  

Balakrishna is all set to enter the Nani HIT Franchise? jsp


సంక్రాంతి బరిలోకి దిగి 'డాకూ మహారాజ్' చిత్రంతో  ​ స్టార్​ హీరో నందమూరి బాలకృష్ణ.. సూపర్​ హిట్​ అందుకున్నారు. గతేడాది విడుదలైన 'అఖండ' సినిమాతో మంచి ఫాంలో ఉన్న బాలయ్య.. అదే దూకుడు ఈ ఏడాది కూడా కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు. బాలకృష్ణ HIT ఫ్రాంచైజీలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని పరిశ్రమ అంతర్గత వర్గాల సమాచారం. 

Balakrishna is all set to enter the Nani HIT Franchise? jsp


 'హిట్: ది ఫస్ట్ కేస్' సినిమాతో దర్శకుడు శైలేశ్ కొలను సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. విశ్వక్ సేన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. ఆ తరవాత  'హిట్: ది సెకండ్ కేస్'​ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో అడివి శేష్ హీరోగా నటించారు. . ఇప్పుడు నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తుండగా, శ్రీనిధి శెట్టి హీరోగా నటిస్తున్న మూడో భాగం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 
 



హిట్ 2 క్లైమాక్స్‌ లో నాని అతిధి పాత్రతో హిట్  3కి లింక్‌ ఉంటుంది. ఇప్పుడు అదే రకమైన ముగింపు  హిట్  3 లో కూడా ఉంటుంది. అక్కడ క్లైమాక్స్‌లో నెక్ట్స్ భాగం హీరోకి లింక్ ఉంటుంది. బాలకృష్ణతో ఆ పాత్రను చేయించడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. HIT సిరీస్ లో హీరోలు ఎంతో కోపంతో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి పాత్రను బాలయ్యతో చేయిస్తే క్లైమాక్స్ కు సరికొత్త హైప్ వచ్చినట్లే అంటున్నారు అభిమానులు!! 


అంటే HIT 4 సినిమాలో నందమూరి బాలకృష్ణను హీరోగా అనుకుంటున్నారట. ఇప్పటికే బాలకృష్ణకు శైలేశ్ కథ వినిపించారట. బాలయ్యకు కథ కూడా నచ్చిందని సమాచారం. రీసెంట్ గా  ఆయన దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.

అంతా శైలేశ్ అనుకున్నట్టు జరిగితే త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని వినికిడి.  ఈ ఫ్రాంచైజ్‌లో చాలా సినిమాలు వస్తాయన్న శైలేశ్.. అన్ని కేసులను కలుపుతూ ఒక సినిమా ఉంటుందని కూడా తెలిపారు.

Latest Videos

click me!