అప్పట్లో చిరంజీవిని తొక్కయ్యటానికి అంత కుట్ర జరిగిందా?

Published : Feb 28, 2025, 03:17 PM IST

ChirajeevI:  చిరంజీవి రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు రజనీకాంత్ ను ఉపయోగించారా? చిరంజీవిని తొక్కేయటానికి కొందరు పెద్ద తలకాయలు స్కెచ్ వేసారట. రజనీకాంత్ సినిమాలు తెలుగులోకి తెచ్చి ఇక్కడ సూపర్ హిట్ చేసి చిరంజీవి సినిమాలను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసారు.

PREV
14
  అప్పట్లో  చిరంజీవిని తొక్కయ్యటానికి అంత కుట్ర జరిగిందా?
Did they bring Rajinikanth to surpass Chiranjeevi? in telugu

ChirajeevI:  ఒక వ్యక్తి, అదీ ఇండస్ట్రీలో పెద్దగా అండలేని సామాన్యుడు ఎదగటం ఎవరికి ఇష్టం ఉండదు. అప్పటికే పాతుకుపోయిన సినిమా వాళ్లకు అసలు నచ్చదు. సినిమా ఇండస్ట్రీ పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కొన్ని కులాలుగా విడిపోయి సర్వైవ్ అవుతూంటుంది.

అలాంటి సమయంలో అందరినీ దాటుకుని ఓ యువ కెరటం వచ్చి సుప్రీమ్ స్టార్ అయ్యి, ఆ తర్వాత మెగా స్టార్ అయ్యి రాజకీయాల్లోకి వస్తున్నాడంటే గుబులు పుట్టదూ. అదే జరిగిందిట. చిరంజీవి రాజకీయాల్లోకి వద్దమనుకున్న రోజుల్లో ఆయన్ని తొక్కేయటానికి పెద్ద స్కెచ్చే కొందరు పెద్ద తలకాయలు వేసాయట. చిరంజీవికి అండంగా ఉన్నట్లు ఉంటూనే వెనక నుంచి కుట్రలు నడిపించారట. 

24
Did they bring Rajinikanth to surpass Chiranjeevi? in telugu


అయితే చిరంజీవి ఓ రేంజిలో ఫామ్ లో ఉన్న టైమ్ అది. ఆయన్ని తొక్కాలంటే ఏమిటి మార్గంట.  అప్పుడు ఓ సీనియర్ పొలిటీషన్ కు వచ్చిన ఐడియా ఒక పెద్ద గీతను చిన్నది చేయాలంటే.. దాని ప్రక్కమరో పెద్ద గీత గీస్తే చాలు... మొదటి గీత చిన్నదై పోతుంది.

'అలాగే చిరంజీవిని చిన్నోడు చేసి వెనక్కి నెట్టాలంటే అంతకు మించిన శక్తి లాంటి రజనీకాంత్ ని వాడాలని. అయితే రజనీకాంత్ ఇలాంటి రాజకీయాలకు దూరం. అందుకే ఆయన పేరుని అడ్డం పెడదాం. ఆయన సినిమాలు తెలుగులోకి తెచ్చి ఇక్కడ సూపర్ హిట్ చేసి చిరంజీవి సినిమాలను దెబ్బ కొడదాం అని ప్లాన్ చేసారు.

34
Did they bring Rajinikanth to surpass Chiranjeevi? in telugu

అందులో భాగంగా అప్పట్లో రజనీకాంత్ సూపర్ హిట్ శివాజీ' విడుదల తర్వాత 'రజనీకాంత్ 'ను తెలుగునాట సైతం కొందరు అదేపనిగా బ్రహ్మరధం పట్టడం మొదలెట్టి భజన చేసారు.   ఇది పనిగట్టుకు చేస్తున్న విపరీత ప్రచారమేమోననే అనుమానాలు అప్పటికీ మీడియాలో కొన్ని పెద్ద తలకాయలకి కలిగాయి.

ముఖ్యంగా...అప్పటికి  త్వరలో రాజకీయాల్లోకి వస్తాడనుకొంటున్న చిరంజీవిని తగ్గించడానికి చేస్తున్న యత్నాల్లా కనిపిస్తున్నాయని కొన్ని చోట్ల కథనాలు కూడా వచ్చాయి. అలాగే రజనీ సినిమాలు ఇంత  పెద్ద హిట్ , అంత పెద్ద హిట్, అలాంటి హీరో మన సౌతిండియాలో లేరు అని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వటం మొదలెట్టారు. కొన్ని పార్టీలు అనుకూల మీడియాలు సైతం ఈ ప్రచారాన్ని తమ వంతు భాధ్యతగా చేసాయి. 
 

44
Did they bring Rajinikanth to surpass Chiranjeevi? in telugu

వాస్తవానికి దక్షిణాదిన.. ఆ మాటకొస్తే భారతదేశంలోనే రజనీకాంత్లాంటి మాస్ హీరో మరొకరు లేరు. విదేశాలలో సైతం.. బాష తెలియని విదేశస్థులకు అభిమాన హీరో కావడం మాటలుకాదు. ఆ ఘనత రజనీకాంత్! అతనికి ఎవ్వరూ సాటిరారు. అయితే తెలుగునాట కొందరు పనిగట్టుకొని రజనీ, చిరంజీవిల మధ్య పోలిక తేవటం ఆ టైమ్ లో చేసారు. అది కూడా డైరెక్టుగా కాదు.. ఇన్ డైరెక్ట్ గా !

రజనీకాంత్ స్థాయిని ఇప్పుడేకాదు... ఎప్పటికి.. ఎవరూ "అందుకోలేరని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇటువంటి ప్రకటనలు ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారో ప్రజలు గ్రహించలేని అమాయకులా?  అంటే ఎవరూ కాదు.  చిరంజీవిపై ఎందుకీ ప్రచారం. అంటే- అతడు రాజకీయాల్లోకి వస్తాడేమో ననేభయమే?  అని అప్పట్లో తేల్చారు. ఆ భయమే రజనీకాంత్ ని ఇక్కడ హైప్ చేయాలని చేసిన ప్రయత్నం. 

Read more Photos on
click me!

Recommended Stories