Mumaith Khan : ఒకప్పుడు ఐటెం సాంగ్స్‌తో ఊపేసిన ముమైత్ ఖాన్ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. డాన్స్ మాస్టర్ లారెన్స్ ఆమెకు వార్నింగ్ ఇవ్వడం వల్లనే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయని టాక్.
Raghava Lawrence warning to Mumaith Khan? in telugu
Mumaith Khan : ఓ టైమ్ లో ముమైత్ ఖాన్ ఫుల్ ఫామ్ లో ఉంది. ఎంతలా అంటే ఆమె ఐటెం సాంగ్ కావాలని హీరోలు అడిగేవారు. “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే…” అంటూ ‘పోకిరి’లో ముమైత్ చిందేసిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు. ఇక ‘యోగి’లో “ఓరోరి యోగి…”అంటూ మురిపించిన వైనాన్ని గుర్తు చేసుకొని మరీ చిందులేసే వారున్నారు. అలాగే ఆమెను ప్రధాన పాత్రలో పెట్టి సినిమాలు చేయటానికి దర్శక,నిర్మాతలు ఉవ్విళ్లూరేవారు.
ఆపరేషన్ దుర్యోధన, మైసమ్మ ఐపియస్, మంగతాయారూ టిఫిన్ సెంటర్, పున్నమినాగు” వంటి చిత్రాలలో ముమైత్ ఖాన్ కీలకమైన పాత్రలు పోషించి మెప్పించారు. ఐటమ్ నంబర్స్ లో ఆమెకు తిరుగేలేదు. . ముఖ్యంగా ముమైత్ తన నడుమును లయబద్ధంగా తిప్పుతూ చేసే ‘బెల్లీ డాన్స్’కు వీరాభిమానులు ఉన్నారు.
ఓ టైమ్ లో సినిమాలకు ఆమె పాటల కోసమే సినిమాలకు వెళ్ళిన వారూ ఉన్నారు . అయితే ముమైత్ ఖాన్ హఠాత్తుగా డౌన్ అయ్యింది. ఒక్కసారిగా ఆమె ఆఫర్స్ తగ్గిపోయాయి. కొత్తవాళ్లు వచ్చేసి ఆమె ప్లేస్ ని ఆక్రమించేసారు. అయితే ఆమె డౌన్ అవ్వటానికి కారణం డాన్స్ మాస్టర్ లారెన్స్ గొడవపడటమే కారణం అని తమిళనాట చెప్పుకుంటూంటారు.
24
Raghava Lawrence warning to Mumaith Khan? in telugu
Mumaith Khan : అయితే ముమైత్ స్పీడుకి లారెన్స్ చెక్ పెట్టారనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడేమాట. అప్పట్లో డ్యాన్సర్ ముమైత్ ఖాన్ కు దక్షిణాదిన బోలెడు గిరాకీ. ముమైత్ ఐటమ్సంగ్ ఉంది అని చెప్పుకోవడం నిర్మాత, దర్శకులకు ఓ క్రేజ్.
ఇంతటి క్రేజ్ సంపాదించుకొన్న ముంబై భామ 'ముమైత్’ సెట్స్ లో రకరకాల డిమాండ్స్ పెట్టడం, నఖరాలు పోవడం చేసేదంటారు. అంత ఫామ్ లో ఉన్నప్పుటు అలా బిహేవ్ చేయటంలోనూ వింతలేదు. దీపం ఉండగానే ఇల్లు అలకాలన్నట్లు డిమాండ్ ఉండగానే నఖరాలుపోవాలన్నది సినిమావారి నిఘంటువులో తొలి సూత్రం. దాన్నే ముమైత్ తు.చ. తప్పకుండా పాటించేదిట.
34
Raghava Lawrence warning to Mumaith Khan? in telugu
Mumaith Khan : సినిమా సెట్స్ కు ఆలస్యంగా రావడం, కాస్ట్యూమ్ల దగ్గర పేచీ పెట్టడం... లాంటివి ముమైత్ కు సాధారణంగా మారిపోయాయి. ఓ టైమ్ లో నాగార్జునలాంటి హీరో కూడా ముమైత్ కోసం సెట్లో వేచి చూడాల్సి రావడంతో దాంతో విషయం తెలిసిన నృత్య దర్శకుడు, సినిమా దర్శకుడు లారెన్స్.. ముమైత్కు గట్టి డోసు ఇచ్చాడు.
"ఇష్టం ఉంటే చెప్పిన టైమ్ కు రా... మేం చెప్పిన కాస్ట్యూమ్స్ వేసుకో... లేదా వెళ్ళి పో" అని గట్టిగా మాట్లాడేసరికి ముమైత్ కు కోపం వచ్చిందిట. అందరిలో ఇలా అంటావా అన్నట్లు ఆమె కోప్పడిందిట. దాంతో సెట్ లో ఇద్దరి మద్యా వివాదం రావటం. ఆ తర్వాత ఆమె ఐటమ్స్ సాంగ్స్ కు లారెన్స్ చేయననటమే కాకుండా, తన సర్కిల్ ని కూడా కట్టడి చేసాడంటారు.
44
Raghava Lawrence warning to Mumaith Khan? in Telugu
Mumaith Khan : అప్పట్లో లారెన్స్ కు డాన్స్ మాస్టర్ గా ఉన్న డిమాండ్ , ఇన్ఫూలియెన్స్ తో ముమైత్ ఆఫర్స్ తగ్గిపోయాయని చెప్పుకుంటారు. ఆ తర్వాత ముమైత్ ఎక్కడా ఈ టాపిక్ మాట్లాడ కుండా 'మమ్' అయిపోయింది. లారెన్స్ నృత్య దర్శకుడు అవడం వల్ల అతనంటే తనకు గౌరవమని, తను తిట్టినా గురుభావంతో ఏమీ అననంటూ ఎవరైనా ఈ టాపిక్ ఎత్తికే చెప్పేదిట ముమైత్.
కానీ అప్పటికే పరిస్దితులు చేతులు దాటి పోయాయని ముమైత్ పై అప్రకటిత బ్యాన్ లాంటిది ఇండస్ట్రి పెట్టిందంటారు. అందులో భాగంగానే రాయ్ లక్ష్మిని ముమైత్ బాగా ఎంకరేజ్ చేసాడని అంటున్నారు. ఇందులో ఎంతవరకూ నిజమో కానీ ముమైత్ మాత్రం బాగా వెనకబడింది. ఎంతలా అంటే ఇప్పటికి కూడా వెనక్కి వచ్చి మినిమం ఆఫర్స్ తెచ్చుకోలేనంతగా.