Puri Jagannadh: మరో సీక్వెల్ తో పూరి జగన్నాథ్ , హీరో ఎవరంటే

Published : Feb 19, 2025, 04:09 PM IST

Puri Jagannadh:  దర్శకుడు పూరి జగన్నాథ్ తన  నెక్ట్స్ ప్రాజెక్ట్ కు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆయన ఈ సారి కూడా సీక్వెల్ తోనే రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమిటా సీక్వెల్, ఎవరా హీరో  

PREV
13
Puri Jagannadh: మరో సీక్వెల్ తో పూరి జగన్నాథ్ , హీరో ఎవరంటే
Puri Jagannadh wants to make sequel to Golimar Moive in telugu


Puri Jagannadh:  ఒకప్పుడు వరస హిట్స్ తో స్టార్ హీరోల సినిమాలతో ఒక వెలుగు వెలిగారు పూరి జగన్నాథ్. రవితేజ, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా చాలా మంది హీరోలకి సూపర్ హిట్స్ ని ఇస్తూ... వచ్చారు పూరీ. ఈ దర్శకుడు డైరెక్షన్ లో ఏ హీరోకైనా  స్పెషల్ ఇమేజ్ వస్తుంది. తర్వాత నిజంగా పెద్ద స్టార్లు కూడా అయిపోతుంటారు.  అయితే రామ్ తో చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా డిజాస్టర్ అవడం అనేది కూడా పూరి ని భారీగా ఇబ్బందుల్లో పడేసింది .నిజానికి ఈ సినిమాతో తన అప్పుల నుంచి బయిటపడదామని సొంత బ్యానర్ లో చేసారు.

అయితే ఆర్దికంగా నష్టమేకాకుండా  ఆయనకు బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది .మరి ఇలాంటి సందర్భాల్లో పూరి నెక్స్ట్ తీయబోయే సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయి. ఈ క్రమంలో ఏ హీరో ఆయనతో చేయటానికి ఆసక్తి చూపిస్తారు.

కానీ ఇప్పుడు ఓ హీరో పూరి తో చేయటానికి ముందుకు వచ్చారట. అలాగే ఆ హీరోతో గతంలో తీసిన సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఆ హీరో ఎవరు..ఆ సీక్వెల్ ఏమిటో చూద్దాం. 

23
Puri Jagannadh wants to make sequel to Golimar Moive in telugu

 

ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి పూరి వచ్చారనుకుంటే ఆ తర్వాత   ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా మ్యాజిక్ రిపీట్ చేయకపోయాయి. దాంతో  పూరి జగన్నాథ్ మీద ప్రతి హీరోకు అంచనాలైతే లేకుండా పోయాయి.

అలాగే జనాల్లోనూ  ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎలాంటి అటెన్షన్ అయితే క్రియేట్ అవ్వడం లేదు.  సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనతో సినిమాలు చేయడానికి  నిర్మాతలు ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ సిట్యువేషన్ లో పూరి తో సినిమా చేయటానికి గోపిచంద్ ఆసక్తి చూపించారట. దాంతో పూరి ..గోపికి ఓ స్క్రిప్టు నేరేట్ చేసారట. 
 

33
Puri Jagannadh wants to make sequel to Golimar Moive in telugu


పూరి జ‌గన్నాథ్ తో గోపీచంద్ చేయబోయే సినిమా కూడా ఓ సీక్వెల్ అని తెలుస్తోంది.  గోపీచంద్ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో `గోలీమార్‌` సినిమా వ‌చ్చింది. క‌మ‌ర్షియ‌ల్ గా పెద్దగా ఏమీ ఆడలేదు. జస్ట్ ఓకే అనిపించిన సినిమా అది.

ఇప్పుడు మ‌రోసారి పూరి – గోపీచంద్ క‌లిసి  ‘గోలీమార్‌’ సీక్వెల్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్న‌ట్టు వినికిడి. అయితే రీసెంట్ గానే ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’అనే సీక్వెల్ తో పూరి బోల్తా కొట్టారు. అయినా మళ్లీ సీక్వెల్ తో పూరి రెడీ అవ్వటం ఏమిటనేది ఎవరికీ మింగుడు పడటం లేదు!

Read more Photos on
click me!

Recommended Stories