తెలుగులో సూపర్ హిట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ కొనసాగుతోంది. ఈ షోకు గత ఏడు సీజన్లుగా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు . ఈ నేపథ్యంలో బిగ్ బాస్ యాజమాన్యం ఆయనకు భారీగా పారితోషికం చెల్లిస్తుదట. ఇక నెక్ట్స్ సీజన్ కు నాగార్జున రెమ్యునరేషన్ ఎంత?
తెలుగులో బిగ్ బాస్ తొలి సీజన్ 2017లో ప్రసారం అయింది. ఆ సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆయన హోస్టింగ్‌కు మంచి స్పందన లభించింది. అయితే సినిమాలు ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా ఎన్టీఆర్ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు. అనంతరం బిగ్ బాస్ తెలుగు సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ బాధ్యతలు చేపట్టారు. నాని హోస్టింగ్‌కు మిశ్రమ స్పందన లభించడంతో పాటు విమర్శలు కూడా వినిపించాయి. దాంతో ఆయన హోస్టింగ్ కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు.
24
సీజన్ 3 నుంచి కొనసాగుతున్ననాగార్జున..
ఇక గతంలో మీ లో ఎవరు కోటీశ్వరుడు? కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునను సీజన్ 3 నుంచి బిగ్ బాస్ హోస్ట్‌గా కొనసాగుతున్నాడు. అప్పటి నుంచి ఆయన వరుసగా షోను నడిపిస్తున్నారు. నాగార్జున సారథ్యంలో షో మంచి టీఆర్పీలు సాధిస్తోంది. సీజన్ 6 మినహా మిగతా అన్ని సీజన్లు విజయవంతమయ్యాయని సమాచారం. ముఖ్యంగా సీజన్ 7తో పాటు గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 బ్లాక్‌బస్టర్ రేటింగ్స్ సాధించింది. దీంతో నాగార్జున హోస్టింగ్ కు డిమాండ్ మరితగా పెరిగింది. కింగ్ రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో పెరిగినట్టు సమాచారం.
34
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం నాగార్జున రెమ్యునరేషన్
ఈ క్రమంలో బిగ్ బాస్ కోసం నాగార్జున రెమ్యునరేషన్‌పై మరోసారి చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, గత ఏడు సీజన్లకు కలిపి నాగార్జున దాదాపు రూ.200 కోట్ల వరకూ పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే సగటున ఒక్కో సీజన్‌కు సుమారు రూ.28 కోట్లు అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇది ఆయన సినిమా రెమ్యునరేషన్ కంటే ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సినిమాల్లో ఆయన మార్కెట్ రీత్యా రూ.20 కోట్లకు తగ్గ పారితోషికమే తీసుకుంటున్నారని సమాచారం. అయితే బిగ్ బాస్ హోస్ట్‌గా దాదాపు ముప్పై కోట్ల వరకు తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక స్పష్టత లేదు.
ఇక తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతం కావడంతో నాగార్జున తన రెమ్యునరేషన్‌ను మరింత పెంచినట్లు సమాచారం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం దాదాపు రూ.40 కోట్ల వరకు తీసుకోబోతున్నారని టాక్. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు షోను బ్యాన్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
సాంప్రదాయవాదులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. హోస్ట్‌గా నాగార్జున కూడా విమర్శల పాలవుతున్నారు. రెమ్యునరేషన్, కంటెస్టెంట్ల వివరాలపై స్పష్టత రానప్పటికీ, బిగ్ బాస్ తెలుగు సీజన్ 10పై ఆసక్తి మాత్రం పెరుగుతోంది. షో మరింత గ్రాండ్‌గా ఉండబోతుందని సమాచారం.