Mahesh Babu:అఫీషియల్... రాజమౌళిని ప్రక్కన పెట్టాడు

First Published | Jul 9, 2022, 12:49 PM IST

మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.. అయితే ఇప్పుడుఅనుకోని ట్విస్ట్ పడింది. రాజమౌళిని ప్రక్కన పెట్టి ముందుకు వెళ్తున్నారు మహేష్ బాబు.


"బాహుబలి" సినిమా తో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి .  రీసెంట్ గా  రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా  రూపొందించిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో రికార్డులను తిరగరాశారు రాజమౌళి. అలాగే తెలుగు తెరపై తిరిగులేని సూపర్ స్టార్ ఎదిగారు మహేష్ బాబు. సర్కారు వారి పాట సినిమా జస్ట్ ఓకే కాన్సెప్టు అయినా తన స్టార్ డమ్ తో దుమ్ము రేపారు మహేష్.  దాంతో వీళ్లిద్దరు కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదనేది అందరికీ అర్దమైంది. దాంతో ఇక  త్వరలోనే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయబోతున్నారనే అధికారిక ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ ఎదురూచూస్తున్నారు. కానీ సీన్ మారింది. 

రాజమౌళితో సినిమా అంటే చాలా టైమ్ తీసుకుంటారు. లొకేషన్స్ హంట్ నుంచి ఫైనల్ కాపీ వచ్చేదాకా హీరో ఆయనకు అందుబాటులో ఉండాలి. అయితే ఈ లోగా తనకు గ్యాప్ రాకుండా చూసూకోవాలని మహేష్ భావిస్తున్నారు. సర్కారు వారి పాట పెద్ద హిట్టై ఉంటే..ఆయన ఖచ్చితంగా రాజమౌళితో ప్రారంభం చేసేసేవారు


 
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం వచ్చే సంవత్సరం చివరకు సెట్స్  పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కోసం చాలానే సమయం కావాలి. అందుకే సినిమా ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతోంది.


ఈ లోగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సినిమా ఫినిష్ చేయబోతున్నారు.  ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్టులో షూటింగ్  ప్రారంభం కానుందని చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. అంతే కాదు... షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే సినిమా విడుదల ఎప్పుడో చెప్పేసింది. 


వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయనున్నట్లు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పేర్కొంది  . మహేష్, త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ చిత్రమిది. దీనికి ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి.   

 మరో ప్రక్క  రాజమౌళితో సినిమా చేయడానికి మహేష్ బాబు ఆలోచనలో పడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా రాజమౌళి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు అయినప్పటికీ ఒక్కో సినిమాకి జక్కన్న ఎక్కువ సమయం తీసుకునే సంగతి అందరికీ తెలిసిందే. అనుకున్న సమయానికి ఎప్పుడు రాజమౌళి సినిమా విడుదల అవ్వదు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు రెండేళ్లు రాజమౌళి సినిమా కోసం పక్కన పెట్టాల్సి వస్తోంది. 

తాజాగా మహేష్ బాబు రాజమౌళికి ఒక రిక్వెస్ట్ చేశారట. సినిమాలో తన పాత్ర కి ఎటువంటి స్పెషల్ లుక్ ఇవ్వద్దని ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసేలాగా ఉంటే బాగుంటుందని మహేష్ బాబు కోరారట. అంతేకాకుండా ఎప్పుడూ బిజీగా ఉండే నటులను కాకుండా సినిమాకి కొంచెం ఫ్రీగా ఉండే నటులను ఎంపిక చేయమని దానివల్ల షూటింగ్ కి ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సిన అవసరం రాదని అన్నారట. 

అయితే మరోవైపు అభిమానులు మాత్రం సర్కారు వారి పాట, మహర్షి వంటి నాలుగు సినిమాలు చేయడం కంటే మూడు నాలుగేళ్లు పట్టినా సరే రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా చేయడం మహేష్ కెరీర్ కి బూస్ట్ అవుతుంది అని భావిస్తున్నారు.

దాదాపు పదేళ్ల క్రితమే మహేష్ బాబుతో జక్కన్న  సినిమా చేయాలని అనుకున్నారు. కానీ, ఇద్దరు మిగతా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇన్నేళ్ళు పట్టింది. ప్రముఖ సీనియర్ నిర్మాత డా.కె ఎల్ నారాయణ , శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  

 ఇక రాజమౌళి  సినిమాలో మాత్రం విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. ఆ పాత్ర కోసం ఒక స్టార్ హీరో కోసం అయితే బాగుంటుందని రాజమౌళి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా కోసం హీరో రానా ను విలన్ గా మార్చిన రాజమౌళి ఈసారి కార్తి, విక్రమ్, లేదా సూర్య వంటి హీరో కోసం వెతుకుతున్నట్లు సమాచారం.

ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ కి రాజమౌళి-మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందని అడగ్గా.. వచ్చే ఏడాది మొదలవుతుందని సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

Mahesh Babu

ఇంకా కథ పూర్తి కాలేదని.. అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చెప్పారు. త్వరలోనే మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా మొదలుకానుంది. నవంబర్ నాటికి త్రివిక్రమ్ సినిమా పూర్తి చేయాలనేది మహేష్ ప్లాన్. 2023లో రాజమౌళి సినిమాను పట్టాలెక్కించనున్నారు. సినిమా మొదలుపెట్టడానికి ముందు రెండు, మూడు నెలల పాటు రాజమౌళి.. మహేష్ తో ట్రావెల్ చేయనున్నారు. 

Image: Mahesh BabuInstagram

త్రివిక్రమ్ తో చిత్రం విషయానికి వస్తే...  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక.  త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - పూజా హెగ్డే, త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - తమన్ కాంబినేషన్ లో కూడా హ్యాట్రిక్ చిత్రమిది.

Latest Videos

click me!